కోవూరు(నెల్లూరు జిల్లా): నెల్లూరు జిల్లా కోవూరు శివారులోని జాతీయ రహదారిలో ఉన్న భారత్ బెంజ్ షోరూమ్ వద్ద శనివారం ఉదయం వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో ప్రకాశం జిల్లా సోదరగుట్ట మండలం రామాపురం గ్రామానికి చెందిన ఎద్దు ఏడుకొండలు అక్కడికక్కడే మృతిచెందగా, ఆయన తండ్రి చెన్నయ్య, భార్య అంకమ్మ, వారి పిల్లలు శ్రీనివాసులు, లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు.
వీరందరూ శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కోవూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడుకొండలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
కారు బోల్తా: ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు
Published Sat, Aug 27 2016 9:38 AM | Last Updated on Tue, Aug 28 2018 5:48 PM
Advertisement
Advertisement