శేఖర్‌కు మాస్టర్ ఫొటోగ్రాఫర్ అవార్డు | ICS USA awarded to sekhar as a Master Photographer | Sakshi
Sakshi News home page

శేఖర్‌కు మాస్టర్ ఫొటోగ్రాఫర్ అవార్డు

Published Sat, Sep 3 2016 8:29 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

ICS USA awarded to sekhar as a Master Photographer

సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ మేర్గు చంద్రశేఖర్ (ఎంసీ.శేఖర్)కు అంతర్జాతీయ స్థాయిలో ఫొటోగ్రఫీ రంగంలో గుర్తింపు లభించింది. అమెరికాకు చెందిన ఇమేజ్ కొలీగ్ సొసైటీ ఆఫ్ అమెరికా(ఐసీఎస్-యూఎస్‌ఏ) ఫొటోగ్రఫీ రంగంలో శేఖర్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా మాస్టర్ ఫొటోగ్రాఫర్‌గా అవార్డును శనివారం ప్రకటించింది. 
 
ఇప్పటికే శేఖర్ రెండున్నర దశాబ్దాలుగా సిగ్మా ఆర్ట్ ఫొటోగ్రఫీ ద్వారా వర్క్‌షాపులు నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన 38 గౌరవ అవార్డులు, 113 జాతీయ అవార్డులను పొందారు. తాజాగా గిరిజన జీవనశైలిపై శేఖర్ ఫొటోలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐసీఎస్-యూఎస్‌ఏ ద్వారా మాస్టర్ ఫొటోగ్రాఫర్ అవార్డు రావడం సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. 

Advertisement

పోల్

Advertisement