పిల్లలు సహా దంపతుల ఆత్మహత్యాయత్నం | Including children couple to commit suicide | Sakshi
Sakshi News home page

పిల్లలు సహా దంపతుల ఆత్మహత్యాయత్నం

Published Thu, Oct 13 2016 10:17 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

Including children couple to commit suicide

కుటుంబసభ్యుల మధ్య విభేదాల నేపథ్యంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. గంగాధర మండలం గర్షకుర్తికి చెందిన భూమేష్‌కు తండ్రితో కొంతకాలంగా తగాదాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లో వారికి ఉన్న దుస్తుల దుకాణం లావాదేవీల్లో విభేదాలే ఈ గొడవలకు కారణం. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి భూమేష్, అతని భార్య మంజుల, పిల్లలు కుమార్తెలకు విషం కలిపిన కూల్ డ్రింక్ తాగారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఐదుగురినీ కుటుంబసభ్యులు గమనించి వేకువజామునే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement