విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
డెలివరీబాయ్‌కు దేహశుద్ధి
బెంగళూరు(బనశంకరి) :విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈఘటన కుమారస్వామిలేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. కుమారస్వామి లేఔట్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ఇరాన్ దేశానికి చెందిన మహిళ నివాసముంటోంది. ఈమె ఆన్‌లైన్‌లో బుక్ చేసిన షూను తీసుకొని ఈ నెల 10న మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కంపెనీ కి చెందిన ఇలియాస్‌నగరకు చెందిన ఆబుసల్మాన్ అనే డెలివరీ బాయ్ వెళ్లాడు.
షూ తీసుకుని డబ్బు ఇచ్చే సమయంలో ఆబూససల్మాన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. భయభ్రాంతులకు గురైన ఆమహిళ గట్టిగా కేకలు వేయడంతో డెలివరీబాయ్ అపార్టుమెంట్ నుంచి కిందికి దిగి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇరుగుపొరుగు వారు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.