గీత రచయితగా హాస్యనటుడు వివేక్ | Lyric Writer Comedian Vivek | Sakshi
Sakshi News home page

గీత రచయితగా హాస్యనటుడు వివేక్

Published Fri, Mar 13 2015 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

గీత రచయితగా హాస్యనటుడు వివేక్

గీత రచయితగా హాస్యనటుడు వివేక్

హాస్య నటుడు వివేక్ మంచి సాహితీకారుడు కూడా ఉన్నాడు. ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీత మైక్ పట్టుకుంటే మాటల దొంతరలు ప్రవహిస్తాయి. వాటిలో హాస్యం, సాహిత్యం, వివేకం, విజ్ఞానం, సామాజిక స్పృహ ఇలా పలు అంశాలు చోటు చేసుకుంటాయి. అయితే హాస్యనటుడిగా అందలం ఎక్కిన వివేక్ హీరోగా నటిస్తున్న మూడో చిత్రం పాలకాట్టు మాధవన్. సోనియా అగర్వాల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్ సొంతంగా ఒక పాట రాయడం విశేషం. ఈ పాటను యువ సంగీత దర్శకుడు అనిరుధ్ పాడితే బాగుంటుందని వివేక్ భావించారు. తన అభిప్రాయాన్ని అనిరుధ్‌కు తెలపగా మరో మాట లేకుండా ఆయన పాడటానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వివేక్ వెల్లడించారు. ఈ పాటను శ్రీకాంత్‌దేవా సంగీత సారథ్యంలో ఇటీవల రికార్డ్ చేసినట్లు తెలిపారు. త్వరలో తెరపైకి రానున్న ఈ చిత్రంలో సీనియర్ దర్శకుడు కె.భాగ్యరాజ్ ముఖ్యపాత్ర పోషించడం మరో విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement