ఆస్తులపై గురి!
ఆస్తులపై గురి!
Published Thu, Dec 1 2016 1:12 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
పదేళ్లుగా చెన్నై మహానగర కార్పొరేషన్ కౌన్సిలర్లుగా వ్యవహరించిన వాళ్లకు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. వారి ఆస్తుల మీద గురి పెట్టి ప్రత్యేక ఉత్తర్వులు బుధవారం జారీ చేసింది. 2006, 2011 స్థానిక ఎన్నికల నామినేషన్ల సమయంలో వారు సమర్పించిన ఆస్తుల వివరాలను కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ఎన్నికల యంత్రాంగానికి న్యాయమూర్తి కృపాకరన్ ఆదేశాలు జారీ చేశారు.
సాక్షి, చెన్నై: స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా వ్యవహరించిన నాయకులు ఆగడాలు ఇటీవల కాలంగా ఇష్టారాజ్యంగా మారి ఉన్న విషయం తెలిసిందే. ప్రతి పనికి పైసా అన్నట్టుగా ప్రతినిధులు దండుకుని అక్రమార్జనను బాగానే కూడబెట్టుకున్నరన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరే విధంగా ఆ సామాన్యుడు కోర్టులో సమర్పించిన ఆధారాలు స్థానిక ప్రతినిధులకు షాక్ ఇచ్చినట్టు అయింది. గత ఏడాది చెన్నైలో వరదలు సృష్టించిన విలయ తాండవంలో ఈంజంబాక్కంకు చెందిన పొన్ తంగ వేలు అనే సామాన్యుడు సర్వం కోల్పోయాడు. సాయం కోసం కార్పొరేషన్ వద్ద చేతులు చాస్తే ఫలితం శూన్యం. కార్పొరేషన్‌కు ఆదాయమే లేదన్నట్టుగా అధికారుల సమాధానం. దీంతో తన కౌన్సిలర్‌ను గురి పెట్టి ఆధారాల అన్వేషణలో పడ్డాడు. ఆ మేరకు ఒక్క కౌన్సిలర్ పదిహేనుకు పైగా ఇళ్లను, భవనాలను కల్గి ఉన్నా, అతడికి పన్ను కేవలం రూ. 55 నుంచి రూ. 110 వరకు, ఓ ప్రత్యేక భవనానికి వెరుు్య వరకు మాత్రమే పన్ను గత కొన్నేళ్లుగా వసూళ్లు చేస్తుండటాన్ని ఆధారాలతో సేకరించాడు.
ఆస్తులపై గురి : కోట్ల ఆస్తులకు వందల్లో ఆస్తి పన్ను ఏమిటో అంటూ అధికారుల్ని ప్రశ్నించినా, పట్టించుకునే వాడు లేదు. దీంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. 196వ వార్డు కౌన్సిలర్ అన్నామలై ఒక్కడే అధికారుల్ని నిర్బంధించి తక్కువ మొత్తంలో పన్ను చెల్లిస్తుంటే, మిగిలిన వారి పరిస్థితి ఏమిటో అని ప్రశ్నిస్తూ, ఇంకెక్కడ ఆదాయం కార్పొరేషన్‌కు వస్తుందని ప్రశ్నిస్తూ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని ఆదాయం పెంపనుకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. ఆ కౌన్సిలర్ ఆస్తులకు తగ్గట్టు ఆధారాలు, భవనాల ఫోటోలను ఆ సామాన్యుడు కోర్టుకు సమర్పించాడు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తి కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. ఆ ఫోటోలను, ఆధారాలను చూసిన న్యాయమూర్తి షాక్‌కు గురి అయ్యారు. వ్యక్తిగత ఆస్తి పన్ను చెల్లింపులోనే ఇంత అధికార దుర్వినియోగం సాగి ఉంటే, మరెంతగా ఆస్తులను కౌన్సిలర్లు కూడ బెట్టుకుని ఉంటారో అన్న అనుమానాన్ని న్యాయమూర్తి వ్యక్తం చేశారు.
దీంతో గత కొన్నేళ్లుగా చెన్నై కార్పొరేషన్ కౌన్సిలర్లుగా వ్యవహరించిన వారికి షాక్ ఇస్తూ ప్రత్యేక ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల యంత్రాంగానికి జారీ చేశారు. 2006, 2011 స్థానిక ఎన్నికల్లో చెన్నై కార్పొరేషన్ కౌన్సిలర్లుగా పోటీ చేసే సమయంలో నామినేషన్లతో ప్రతి ఒక్కరూ ఆస్తుల వివరాల్ని జత పరిచి ఉంటారన్న విషయాన్ని గుర్తు చేశారు. దీనిని పరిగణలోకి తీసుకుని ఎవ్వరెవ్వరు గెలిచారో, వారి ఆస్తుల వివరాలన్నీ శుక్రవారం నాటికి కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆ వివరాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొంటూ, అదే రోజుకు విచారణను వారుుదా వేశారు. అలాగే, 196వ వార్డు కౌన్సిలర్ అన్నామలై వరసగా విజయాలతో కౌన్సిలర్ వ్యవహరిస్తూ వచ్చినట్టు ఆధారాలు తేల్చిన దృష్ట్యా, ఆయన ఆస్తుల వివరాలను ప్రత్యేకంగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో గత నెల తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కార్పొరేషన్ కౌన్సిలర్లలో దఢ బయలు దేరి ఉన్నది. ఇందుకు కారణం , తమ పదవీ కాలంలో అక్రమార్జనతో దండుకున్న కౌన్సిలర్లు చెన్నైలో ఎక్కువే.
Advertisement