రేపటి నుంచి మస్తాన్‌వలి ఉరుసు ఉత్సవాలు
Published Mon, May 22 2017 4:19 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM
మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం కోట వీధిలోని ప్రముఖ హజరత్ ఖాజా సయ్యద్ షా మస్తాన్‌వలి దర్గా ఉరుసు ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దర్గా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్గాను రంగురంగు విద్యుద్దీపాలతో అలంకరించారు. మంగళవారం ఉదయం గంధం, బయాన్ (ధార్మిక ఉపన్యాసం), అన్నదానం నిర్వహిస్తారు.
24వ తేదీ ఉదయం ఉరుసు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఉరుసు ఉత్సవాలకు కడప సద్గురు హజరత్ సయ్యద్ షా అరిపుల్లా మొహమ్మద్ మహమ్మదుల్ హుస్సేని చిష్టివుర్‌ఖాద్రితోపాటు పలువురు గురువులు హాజరుకానున్నట్లు దర్గా అధ్యక్షుడు సత్తార్‌ఖాన్ తెలిపారు. 25న మధ్యాహ్నం తహలీల్ ఫాతెహా జరుగుతుందన్నారు. ఉరుసు ఉత్సవాలకు హిందూముస్లిం సోదరులు హాజరు కావాలని కోరారు.
Advertisement
Advertisement