’ఆయుష్ వైద్యం మరింత బలోపేతం’ | medak mp kotta prabhakar reddy starts free ayurveda camp | Sakshi
Sakshi News home page

’ఆయుష్ వైద్యం మరింత బలోపేతం’

Published Tue, Oct 25 2016 3:51 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

’ఆయుష్ వైద్యం మరింత బలోపేతం’

’ఆయుష్ వైద్యం మరింత బలోపేతం’

సిద్ధిపేట: ఆయుష్ వైద్య విభాగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటోందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ధన్వంతరి జయంతి-జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సిద్ధిపేట జిల్లా కేంద్రమైన టీఎన్జీవోస్ భవనంలో ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా అల్లోపతి వైద్యానికి దీటుగా ఆయుష్ వైద్యాన్ని తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నదని చెప్పారు. వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొనారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement