
అంధురాలిగా మీరాజాస్మిన్
నటి మీరాజాస్మిన్‌ను తమిళ తెరపై చూసిన చాలా కాలమైంది. త్వరలో సండైకోళి-2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్న ఈ మలయాళీ భామ అంతకు ముందు ఒక అనువాద చిత్రం ద్వారా అలరించడారిని రంగం రెడీ అయ్యింది.మలయాళంలో మిస్సెస్ లేఖ తరూర్ పేరుతో తెరకెక్కిన వైవిధ్యభరిత కథా చిత్రాన్ని తమిళంలోకి డీ.వెంకటేశ్ డీవీ క్రియేషన్స్ నతాకంపై కన్‌గళ్ ఇరండాళ్ పేరుతో అనువదిస్తున్నారు. ఫాజియం కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన ఈ చిత్రానికి రమేష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు.
శనివారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర యూనిట్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు చిత్ర వివరాలను వెల్లడిస్తూ నటి మీరాజాస్మిన్ తొలిసారిగా అంధురాలిగా నటించిన చిత్రం ఇదని తెలిపారు. అలెక్స్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గురించి చెప్పాలంటే మీరాజాస్మిన్ ఒక టీవీ చానల్‌లో రియాలిటీ షో నిర్వహిస్తుంటారన్నారు. అలాంటి ఒక తరుణంలో ఒక యువకుడి ప్రేమలో పడతారని చెప్పారు. మీరాజాస్మిన్‌కు కళ్ల ముందు ఏదో రూపం కదలాడుతున్నట్లు భావన కలుగుతుందన్నారు. ప్రశ్నలకు సమాధానం కావాలంటే చిత్రం చూడాల్సిందేనన్నారు.