వికలాంగుల హక్కుల వేదిక నాయకులతో కేంద్ర మంత్రి గెహ్లాట్
సాక్షి, న్యూఢిల్లీ: వికలాంగుల హక్కుల బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి తారాచంద్ గెహ్లాట్ హామీ ఇచ్చినట్లు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక నాయకులు తెలిపారు. వేదిక జాతీయాధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్‌రావు నాయకత్వంలో ప్రతినిధి బృందం బుధవారం కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చింది. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు రాజకీయాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు, వికలాంగుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు, స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. వికలాంగుల హక్కుల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడంతో పాటు వికలాంగుల గుర్తింపు కార్డులు, ఉద్యోగాల భర్తీ అంశాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో అంధుల సంఘం అధ్యక్షుడు పీవీ రావు, మాణిక్యాలరావు తదితరులు ఉన్నారు.
వికలాంగుల బిల్లు వచ్చే సమావేశాల్లో పెడతాం
Published Wed, Mar 18 2015 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM
Advertisement
Advertisement