అద్దెకున్న అమ్మాయిపై ఎస్ఐ దారుణం | Osmanabad cop arrested for allegedly raping girl at gunpoint | Sakshi
Sakshi News home page

అద్దెకున్న అమ్మాయిపై ఎస్ఐ దారుణం

Published Sat, Aug 6 2016 4:39 PM | Last Updated on Sun, Sep 2 2018 5:04 PM

అద్దెకున్న అమ్మాయిపై ఎస్ఐ దారుణం - Sakshi

అద్దెకున్న అమ్మాయిపై ఎస్ఐ దారుణం

ఉస్మానాబాద్: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్కు చెందిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సుఖ్దేవ్ బన్సొడె (26) తన ఇంట్లో అద్దెకున్న అమ్మాయిని (16) తుపాకీతో బెదిరించి లైంగికదాడి చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను బెదిరించాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆనంద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ప్రేమ్ సుఖ్దేశ్ సాంగ్లి జిల్లాలోని విష్రామ్బాగ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తుండగా, ఆయన కుటుంబం ఉస్మానాబాద్లో ఉన్నట్టు ఏఎస్పీ దీపాలీ గాడ్జె చెప్పారు. బాధితురాలి కుటుంబం ఉస్మానాబాద్లో ప్రేమ్ సుఖ్దేవ్ ఇంట్లో అద్దెకు ఉంటోంది. నిందితుడు తన ఇంట్లోనే ఆ అమ్మాయిని బెదిరించి దారుణానికి పాల్పడ్డాడు. ప్రేమ్ సుఖ్దేవ్ను ఉస్మానాబాద్లో అరెస్ట్ చేసినట్టు ఏఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement