ఒకరోజు పోలీస్ కస్టడీకి ధనంజయ్ దేశాయ్ | Pune techie murder: HRS head Dhananjay Desai sent to police custody Read more at: http://www.firstpost.com/india/pune-techie-murder-hrs-head-dhananjay-desai-sent-to-police-custody-1566349.html?utm_source=ref_article | Sakshi
Sakshi News home page

ఒకరోజు పోలీస్ కస్టడీకి ధనంజయ్ దేశాయ్

Published Wed, Jun 11 2014 11:40 PM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

ఒకరోజు పోలీస్ కస్టడీకి ధనంజయ్ దేశాయ్ - Sakshi

ఒకరోజు పోలీస్ కస్టడీకి ధనంజయ్ దేశాయ్

పుణే: హిందూ రాష్ట్ర సేన అధ్యక్షుడు ధనంజయ్ దేశాయ్‌ని న్యాయస్థానం ఒకరోజు పోలీస్ కస్టడీకి పంపింది. పుణేలోని హడప్సర్ ప్రాంతంలో ఈ నెల 2న జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య కేసులో దేశ్‌య్ కూడా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఛత్రపతి శివాజీ, శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రేపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడనే అనుమానంతో మొహసిన్ షేక్‌ను హిందూ రాష్ట్ర సేనకు చెందిన వ్యక్తులుగా భావిస్తున్న కొందరు కొట్టి చంపిన విషయం తెలిసిందే.

 

ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటిదాకా 19 మందిని అరెస్టు చేశారు. ఇందులో ధనంజయ్‌కు కోర్టు మంగళవారం 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను ప్రశ్నించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరడంతో బుధవారం అందుకు అనుమతిస్తూ ఒకరోజు పోలీస్ కస్టడీకి పంపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement