జ్యోతిష్యుడి రాసలీలలు | Rasalilalu sciences | Sakshi
Sakshi News home page

జ్యోతిష్యుడి రాసలీలలు

Published Sun, Apr 27 2014 2:42 AM | Last Updated on Tue, Aug 14 2018 3:25 PM

Rasalilalu sciences

  •   వివిధ చానళ్లలో ప్రసారం               
  •   పలాయనం చిత్తగించిన పండితుడు
  •   బేరం కుదర క సీడీలను బయటపెట్టిన కారు డ్రైవర్
  •  బెంగళూరు, న్యూస్‌లైన్ :  జ్యోతిష్యం, వాస్తు చెబుతూ తనకు తాను గురూజీగా ప్రకటించుకున్న ఓ ప్రబుద్ధుడి రాసలీలలు శనివారం నగరంలో కలకలం సృష్టించాయి. ఇక్కడి హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ 26వ మెయిన్ రోడ్డులో దేవిశ్రీ గురూజీ అలియాస్ దేవిశ్రీ రామస్వామి అలియాస్ రామస్వామి అలియాస్ రాముకు ‘దివ్య జ్యోతిష్యాలయం’ ఉంది. ఓ కన్నడ టీవీ చానల్‌లో కూడా వాస్తు, జోతిష్యం గురించి చెప్పేవాడు. అతని దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే భారీగా డబ్బులుండాలి.

    హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో జ్యోతిష్యాలయం ఉందంటే ఆయన వైభోగం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్వామి ఓ యువతితో సాగించిన రాసలీలల వీడియోలు కొన్ని కన్నడ చానళ్లకు లభ్యమయ్యాయి. శనివారం వాటిని ప్రసారం చేయడంతో ‘స్వామీజీ’ తమిళనాడుకు పలాయన ం చిత్తగించాడు. ఈ విషయం తెలిసి స్థానికులు ఆయన జ్యోతిష్యాలయం వద్ద ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. కార్యాలయం ముందు దేవిశ్రీ ఫౌండేషన్ ట్రస్టు అని రాసి ఉన్న కారును ధ్వంసం చేశారు. టీవీ చానల్‌లో కూడా జ్యోతిష్యం చెబుతున్నాడు కనుక తన వాహన ంపై ‘ప్రెస్’ అని రాసేసుకున్నాడు.
     
    ముగ్గురితో రాసలీలలు
     
    కార్యాలయంలో పని చేస్తున్న రిసెప్షన్‌నిస్ట్ సహా ముగ్గురితో అతను రాసలీలు సాగించాడు. కష్టాలలో ఉన్నానని వచ్చిన ఒక యువతితో కూడా ప్రేమాయణం సాగించడం, ఆమె గర్భం దాల్చడంతో స్వామీజీని తిట్టడం లాంటి దృశ్యాలన్నీ ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
     
    బేరం కుదరక...బయట పెట్టిన డ్రైవర్
     
    రాసలీలల ఫుటేజీని చేజిక్కించుకున్న అతని కారు డ్రైవర్ వసంత్ (కేరళకు చెందిన వాడు) రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేనట్లయితే బహిర్గత పరుస్తానని హెచ్చరించాడు. దేవిశ్రీ రూ. 5 లక్షలు ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తీసుకుని అతను తమిళనాడుకు వెళ్లిపోయాడు. వారం నుంచి మళ్లీ మిగిలిన రూ.5 లక్షల కోసం డిమాండ్ చేస్తూ వచ్చాడు. అతను నిరాకరించడంతో ఫుటేజీని చేర్చాల్సిన చోటికి చేర్చేశాడు.
     
    అర్చకత్వం నుంచి...
     
    కోలారు జిల్లా ముళబాగిలు సమీపంలోని హొసహళ్లికి చెందిన రాము అలియాస్ రామస్వామి 10వ తరగతి వరకు చదువుకున్నాడు. తొలుత ముళబాగిలులోని అయ్యప్ప స్వామి దేవాలయం పూజారిగా పని చేశాడు. అనంతరం కనకపురలోని శ్రీ గణేశ్ దేవాలయంలో శ్రీధర్ ఆచార్ అనే అర్చకుని వద్ద సహాయకుడిగా చేరాడు. అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో అక్కడి నుంచి తరిమేశారు. 2003 నుంచి హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లోని ఒక ఇంటిలో(ఇంటి యజమాని దుబాయ్‌లో ఉంటున్నాడు) కార్యాలయం నిర్వహిస్తున్నాడు. కాగా ఈ సంఘటనపై ఇంకా ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement