భారీగా ఎర్రచందనం స్వాధీనం: 53 మంది అరెస్టు
Published Wed, Nov 23 2016 3:17 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
కడప: ఒకేసారి జిల్లాలోని మూడు ప్రాంతాల్లో అటవీ అధికారులు దాడులు జరిపి భారీగా ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు పోలీసు స్టేషన్ పరిధిలోని యర్రగుంట్ల, కొండాపురం ఓబన్న క్రాస్ వద్ద, అలాగే ముద్దనూరు-యర్రగుంట్ల మార్గంలోని కదిరివారిపల్లె అటవీ ప్రాంతాల్లో ఆ శాఖ అధికారులు దాడులు చేసి ఎర్రచందనం చెట్లు నరుకుతున్న 53మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి టన్ను బరువు ఉన్న ఎర్రచందనం దుంగలను, మూడు వాహనాలను, 26 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్‌డీ ఏసుబాబు వెల్లడించారు.
Advertisement
Advertisement