redsander caught
-
రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో పెద్ద మొత్తంలో గురువారం ఎర్రచందనం పట్టుబడింది. జిల్లా సరిహద్దు అడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు, 20 సెల్‌ఫోన్స్, రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లని జిల్లా ఎస్పీ రామకృష్ణ తెలిపారు. -
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి: ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలిస్తూ నాగరాజు అనే స్మగ్లర్ పట్టుబడ్డాడు. ఓ కంటైనర్‌లో 134 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా తమిళనాడు చెక్‌పోస్ట్ వద్ద టాస్క్ ఫోర్సు పోలీసులు అడ్డగించి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. కంటైనర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వే కోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం బలపల్లె వద్ద టాస్క్ఫోర్సు తనిఖీలు జరిపింది. ఈ సందర్భంగా టాస్క్ఫోర్సు అధికారులను చూసి పదిమంది ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. ఆ స్థలంలో 9 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం: 53 మంది అరెస్టు
కడప: ఒకేసారి జిల్లాలోని మూడు ప్రాంతాల్లో అటవీ అధికారులు దాడులు జరిపి భారీగా ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు పోలీసు స్టేషన్ పరిధిలోని యర్రగుంట్ల, కొండాపురం ఓబన్న క్రాస్ వద్ద, అలాగే ముద్దనూరు-యర్రగుంట్ల మార్గంలోని కదిరివారిపల్లె అటవీ ప్రాంతాల్లో ఆ శాఖ అధికారులు దాడులు చేసి ఎర్రచందనం చెట్లు నరుకుతున్న 53మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి టన్ను బరువు ఉన్న ఎర్రచందనం దుంగలను, మూడు వాహనాలను, 26 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ ఏసుబాబు వెల్లడించారు. -
రూ. 20 లక్షల విలువైన ఎర్ర చందనం పట్టివేత
రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరంలో పోలీసులు, అటవీ అధికారులు భారీగా ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. మండలంలోని పెద్దకంబలూరు, శ్రీరంగాపురం, నర్సాపురం గ్రామాలకు చెందిన 13 మంది సమీపంలోని అడవి నుంచి ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. మొత్తం వెయ్యి టన్నుల బరువున్న45 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుండగుల ప్రధాన సూత్రధారిగా శ్రీరంగాపురం గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అని పోలీసులు చెప్పారు. పట్టుబడిన దుంగల విలవు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులందరినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. -
ఉల్లిగడ్డల మాటున ఎర్రచందనం
వీరబల్లె: ఉల్లిగడ్డలలోడులో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వైఎస్సార్ జిల్లా వీరబల్లె పోలీసులు ముందుగా అందిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం వంగిమళ్ల అటవీ ప్రాంతం నుంచి వస్తున్న వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా టాటాఏస్ వాహనంలో ఉల్లిగడ్డల లోడు పేరుతో తరలిస్తున్న సుమారు రూ.3.50 ల క్షల విలువైన 26 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉల్లిగడ్డలను గ్రామస్తులకు పంచిపెట్టి, పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.