- విద్యార్థులకు భోజనం : మంత్రి
సాక్షి, బెంగళూరు : నగరంలోని మహారాణి కళాశాలతో సహా ఆరు కాలేజీల్లో రూ. 5లకే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్ తెలిపారు. ‘ఆధునిక కాలంలో గాంధేయవాదం ఆవస్యకత’ అనే విషయమై మహారాణి కళాశాలలో రెండు రోజుల జాతీయ స్థాయి సమావేశాలను గురువారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు.
తక్కువ ధరతో కళాశాల విద్యార్థులకు భోజనం అందించే విషయమై ఇప్పటికే ఇస్కాన్‌తో చర్చలు జరిపినట్లు తెలిపారు.త్వరలో ఉన్నత విద్య, సంక్షేమ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. బోధనేతర సిబ్బందికి రూ. 10, ఉపాధ్యాయులకు రూ. 20కే మధ్యాహ్న భోజనం ఇప్పించే ఆలోచన కూడా ఉందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ఎం.వి.రాజశేఖరన్ పాల్గొన్నారు.