నదుల అనుసంధానం కోసం రూ.కోటి | Rs.Crore For interlinking of rivers! | Sakshi
Sakshi News home page

నదుల అనుసంధానం కోసం రూ.కోటి

Published Tue, Jun 28 2016 4:13 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

నదుల అనుసంధానం కోసం రూ.కోటి

నదుల అనుసంధానం కోసం రూ.కోటి

రజనీ సోదరుడు సత్యనారాయణ వెల్లడి
సాక్షి, చెన్నై: ఇచ్చిన మాట ప్రకారం నదీ జలాల అనుసంధానం కోసం రజనీకాంత్ కోటి రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేశారని, ఆ పనులు మొదలవగానే డబ్బును అందజేస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణ సోమవారం తంజావూరులో విలేకరుల సమక్షంలో వెల్లడించారు. దేశ వ్యాప్తంగా నదీజలాల అనుసంధానం జరగాలన్న కోరిక పలువురి నుంచి వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ పథకం కోసం రూ.కోటి అందిస్తాననీ నటుడు రజనీకాంత్ ప్రకటించారు.

ఇదిలా ఉండ గా గత వారం తిరుచ్చిలో దక్షిణ భారత నదీజలాల అనుసంధాన వ్యవసాయ సంఘం రాష్ట్ర నిర్వాహకుల సమావేశం నిర్వహించారు. అందులో రూ.కోటి ఇస్తానన్న రజనీకాంత్‌పై ఆ మొత్తాన్ని ప్రధాని మోదీకి అందించాలని ఒత్తిడి చేయాలని తీర్మానం చేశారు. కాగా రజనీకాంత్ సోదరుడు ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి కుంభకోణంలోని ఆలయాలను దర్శించారు.

అనంతరం సోమవారం తంజావూరుకుకి చేరుకుని అక్కడ దేవాలయంలో శివపార్వతులకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రజనీకాంత్ సంపూర్ణ ఆరోగ్యం కోసం, ప్రపంచ శాంతి కోసం విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రజనీకాంత్ అమెరికాలో వైద్య చికిత్సలు పొంది ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఆయన నదీజలాల అనుసంధానం కోసం కోటి రూపాయలు ప్రకటించారన్నారు. ఆ మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేశారనీ, పనులు ఎప్పుడు మొదలైతే అప్పుడు సంబంధిత నిర్వాహకులకు డబ్బును అందజేస్తారని తెలిపారు. రజనీ చెప్పింది చేస్తారనీ, అది ఆయన నైజమని సత్యనారాయణ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement