సంక్రాంతి సరుకుల పంపిణీ
Published Tue, Jan 7 2014 4:31 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: జిల్లాలో ఉన్న నాలుగు లక్షల మంది అర్హులకు సంక్రాంతి సరుకులు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రమణ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన సంకాంత్రి సరుకులను పంపిణీ చేసే కార్యక్రమం సోమవారం తిరువళ్లూరులో మంత్రి రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు అధ్యక్షత వహించారు. మంత్రి రమణ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా 10 లక్షల మందికి చీరలు, ధోవతులను అందజేస్తామన్నారు. అదేవిధఃగా కిలో బియ్యం, చక్కెర, ఇతర వస్తువులు, రూ.100 అందజేస్తున్నట్టు మంత్రి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేణుగోపాల్, ఎమ్మెల్యేలు మణిమారన్, పొన్‌రాజా, జెడ్పీ చైర్మన్ రవిచంద్రన్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement