సాక్షి, ముంబై: ఠాణేలోని ఓవల్-మాజీవాడ నియోజకవర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయిక్‌కు రవి పుజారి ముఠా నుంచి బెదిరింపు ఫోన్లు రావడంతో స్థానిక పోలీసు కమిషనర్ వి.వి.లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మాజీ వైద్య, విద్యా శాఖ మంత్రి జితేంద్ర అవ్హాడ్ బెదిరింపు ఫోన్ వచ్చిన విషయం మరువకముందే సర్నాయిక్‌కు ఫోన్ రావడం పోలీసు శాఖను కలవరానికి గురిచేసింది.
గత పది రోజులుగా తన కార్యాలయానికి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫొన్ నంబరు వివరాలను పోలీసులకు అందజేశారు. నంబరు ఆధారంగా స్థానిక వర్తక్‌నగర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సర్నాయిక్ రాజకీయాలతో పాటు హోటల్, బిల్డర్ రంగంలో ఉన్నారు. పాన్‌సరే మాదిరిగా హతమారుస్తామని ఇదివరకే అవ్హాడ్‌కు బెదిరింపు ఫోన్ వచ్చింది. తాజాగా సర్నాయిక్‌కు కూడా బెదిరింపు ఫోన్ రావడంతో ఇరువురికి పోలీసు రక్షణ కల్పించారు.
శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయిక్‌కు బెదిరింపు కాల్
Published Fri, Mar 13 2015 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM
Advertisement
Advertisement