ravi pujari gang
-
శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయిక్‌కు బెదిరింపు కాల్
సాక్షి, ముంబై: ఠాణేలోని ఓవల్-మాజీవాడ నియోజకవర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయిక్‌కు రవి పుజారి ముఠా నుంచి బెదిరింపు ఫోన్లు రావడంతో స్థానిక పోలీసు కమిషనర్ వి.వి.లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మాజీ వైద్య, విద్యా శాఖ మంత్రి జితేంద్ర అవ్హాడ్ బెదిరింపు ఫోన్ వచ్చిన విషయం మరువకముందే సర్నాయిక్‌కు ఫోన్ రావడం పోలీసు శాఖను కలవరానికి గురిచేసింది. గత పది రోజులుగా తన కార్యాలయానికి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫొన్ నంబరు వివరాలను పోలీసులకు అందజేశారు. నంబరు ఆధారంగా స్థానిక వర్తక్‌నగర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సర్నాయిక్ రాజకీయాలతో పాటు హోటల్, బిల్డర్ రంగంలో ఉన్నారు. పాన్సరే మాదిరిగా హతమారుస్తామని ఇదివరకే అవ్హాడ్‌కు బెదిరింపు ఫోన్ వచ్చింది. తాజాగా సర్నాయిక్‌కు కూడా బెదిరింపు ఫోన్ రావడంతో ఇరువురికి పోలీసు రక్షణ కల్పించారు. -
బొమన్ ఇరానీకి బెదిరింపులు
సాక్షి, ముంబై: ప్రముఖ హిందీ నటుడు బోమన్ ఇరానీని హతమారుస్తామని రవిపూజారి ముఠా నుంచి బెదిరింపు ఫోన్ వచ్చింది. దీంతో ఆయనకు తగిన భద్రత కల్పించినట్లు నగర పోలీసు వర్గాలు తెలిపాయి. ఇరానీ రూపొందించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా దీపావళికి విడుదల అవుతుందని ప్రకటించిన నాటి నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. దీంతో భద్రత కల్పించారు. ఇందులో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే ప్రధాన తారాగణం. అయితే ఈ సినిమా అంతర్జాతీయ హక్కుల కోసం రవి పూజారి.. షారుఖ్, ఇరానీని బెదిరించినట్టు తెలి సింది. ఇదే ముఠా సభ్యులు ఆగస్టు 23న జుహూలో ఉండే నిర్మాత అలీ మొరానీ ఇంటి బయట ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. అం దులో రెండు బుల్లెట్లు పూల మొక్కల కుండీలకు, మరో రెండు కిటికీ అద్దాలకు, ఒకటి కాం పౌండ్లో పార్క్ చేసిన బీఎండబ్ల్యూ కారు బానెట్‌కు తగిలాయి. మొరానీ ఇంటి ముందు కాల్పు లు జరిపిన రెండు రోజుల తరువాత షారుఖ్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ చిత్ర నిర్మాణ సంస్థ కు పూజారి ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో షారుఖ్‌తోపాటు మొరానీ, ఇరానీకి భద్రత కల్పిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఇరానీ విదేశీ నంబర్ల నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చినట్టు విచారణలో తేలింది. రవి పూజారి దుబాయ్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. -
షారుక్‌పై ముంబై మాఫియా గురి?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు ముంబైలోని అండర్ వరల్డ్ మాఫియా నుంచి ముప్పు పొంచి ఉందా? షారుక్‌తో మాట్లాడేందుకు రవి పూజారి ప్రయత్నించాడా? సరిగ్గా ఇలాంటి అనుమానాలే ముంబై పోలీసులకు కూడా వచ్చాయి. దాంతో సూపర్‌స్టార్‌కు భద్రత మరింత పటిష్ఠం చేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. సోమవారం మధ్యాహ్నమే షారుక్‌తో మాట్లాడేందుకు రవిపూజారి ప్రయత్నించినట్లు సమాచారం. దాంతో ముందు జాగ్రత్త చర్యగా షారుక్ భద్రత పెంచారు. బాలీవుడ్ నిర్మాత అలీ మొరానీ ఇంటివద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇటీవలే ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. షారుక్ ఖాన్‌కు అలీ మొరానీ చాలా సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి కూడా. కొన్ని రోజుల క్రితమే తనకు పెద్దమొత్తంలో డబ్బులు పంపాలంటూ అలీ మొరానీకి రవి పూజారి నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చినా, ఆయన వాటిని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో భయపెట్టేందుకు కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఇప్పుడు ఆయనకు సన్నిహితుడైన షారుక్‌పై కూడా రవిపూజారి కన్ను పడిందని చెబుతున్నారు. షారుక్ ప్రస్తుతం 'హేపీ న్యూ ఇయర్' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు.