మీడియాకు స్వీయనియంత్రణ అవసరం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: మీడియా వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండబోదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అరుుతే మీడియా కాలానుగుణంగా తగు మార్పులు చేసుకుని స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) స్వర్ణోత్సవాల సందర్భంగా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ‘అనియంత్రిత వార్తా కథనాలు పెద్ద సమస్యలు సృష్టించవచ్చని మహాత్మా గాంధీ చెప్పారు. అరుుతే మీడియాపై బాహ్య నియంత్రణ ఊహించలేమనీ అన్నారు. మీడియాపై బాహ్య నియంత్రణ సమాజానికి అంత మంచిది కాదు. అందుకే మీడియా వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు.
అరుుతే స్వీయ ఆత్మశోధన చేసుకోవడం అంత సులభం కాదన్నది ముమ్మాటికి నిజం. కాలానుగుణంగా మీడియా ఏయే మార్పులు సంతరించుకోవాలో పర్యవేక్షించాల్సిన బాధ్యత పీసీఐ, మీడియాకు సంబంధించిన సంస్థలదే. బాహ్య నియంత్రణతో మార్పులేం రావు’అని అన్నారు. అరుుతే మీడియాలో రావాల్సిన మార్పులేంటో పేర్కొనలేదు. కానీ పాత జర్నలిస్టులకు తప్పొప్పులు సరిదిద్దుకోవడానికి తగిన సమయం ఉండేదని.. వేగవంతమైన ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వల్ల ప్రస్తుత జర్నలిస్టులకు అలాంటి అవకాశం లభించడం లేదన్నారు. బిహార్‌లో జరిగిన ఇద్దరు జర్నలిస్టుల హత్యలపై స్పందిస్తూ... ఇది చాలా బాధాకరమని అన్నారు.
సంచలనాలు వద్దు: వెంకయ్య
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మీడియా సంచలనాత్మక కథనాలకు దూరంగా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.