self-regulation
-
స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి
న్యూఢిల్లీ: వినియోగదారులను నష్టపర్చేలా పలు ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ ’డార్క్ ప్యాటర్న్’ పద్ధతులు పాటిస్తుండటంపై కేంద్రం దృష్టి సారించింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే దిశగా స్వీయ నియంత్రణ వ్యవస్థను రూపొందించుకోవాలని సంస్థలను ఆదేశించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగీ, జొమాటో తదితర ఈ–కామర్స్ సంస్థలతో భేటీ అనంతరం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో ఇందుకు సంబంధించిన తగు వ్యవస్థ ఏర్పాటు కాగలదని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నెట్లో వినియోగదారులను ఉద్దేశపూర్వకంగా మోసం చేసే విధానాలను డార్క్ ప్యాటర్న్లుగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు యూజరు ఎంచుకోకపోయినా షాపింగ్ బాస్కెట్లో కొన్ని ఐటమ్‌లను జోడించేయడం, చెక్ అవుట్ చేసే సమయంలో ఉత్పత్తుల ధరలను మార్చేయడం, తక్షణం కొనుగోలు చేయకపోతే నష్టపోతామేమో అనే తప్పుడు భావన కలిగేలా తొందరపెట్టడంలాంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. మధ్యవర్తులు అమ్మకాలను పెంచుకునేందుకు లేదా అమ్ముకునేందుకు అమలు చేసే మోసపూరిత విధానాల గురించి ఈ–కామర్స్ సైట్లను వాడే వినియోగదారులకు, విక్రేతలకు పెద్దగా తెలియదని సింగ్ చెప్పారు. దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ అవగాహన కల్పించి, స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇలాంటి పద్ధతులు కొనసాగితే ఈ విషయంలో నిబంధనలను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. -
మీడియాకు స్వీయనియంత్రణ అవసరం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: మీడియా వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండబోదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అరుుతే మీడియా కాలానుగుణంగా తగు మార్పులు చేసుకుని స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) స్వర్ణోత్సవాల సందర్భంగా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ‘అనియంత్రిత వార్తా కథనాలు పెద్ద సమస్యలు సృష్టించవచ్చని మహాత్మా గాంధీ చెప్పారు. అరుుతే మీడియాపై బాహ్య నియంత్రణ ఊహించలేమనీ అన్నారు. మీడియాపై బాహ్య నియంత్రణ సమాజానికి అంత మంచిది కాదు. అందుకే మీడియా వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అరుుతే స్వీయ ఆత్మశోధన చేసుకోవడం అంత సులభం కాదన్నది ముమ్మాటికి నిజం. కాలానుగుణంగా మీడియా ఏయే మార్పులు సంతరించుకోవాలో పర్యవేక్షించాల్సిన బాధ్యత పీసీఐ, మీడియాకు సంబంధించిన సంస్థలదే. బాహ్య నియంత్రణతో మార్పులేం రావు’అని అన్నారు. అరుుతే మీడియాలో రావాల్సిన మార్పులేంటో పేర్కొనలేదు. కానీ పాత జర్నలిస్టులకు తప్పొప్పులు సరిదిద్దుకోవడానికి తగిన సమయం ఉండేదని.. వేగవంతమైన ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వల్ల ప్రస్తుత జర్నలిస్టులకు అలాంటి అవకాశం లభించడం లేదన్నారు. బిహార్‌లో జరిగిన ఇద్దరు జర్నలిస్టుల హత్యలపై స్పందిస్తూ... ఇది చాలా బాధాకరమని అన్నారు. సంచలనాలు వద్దు: వెంకయ్య కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మీడియా సంచలనాత్మక కథనాలకు దూరంగా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.