ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే
ఉన్నత విద్యాశాఖలో స్మార్ట్ క్లాస్, వర్చువల్ క్లాస్ వ్యవస్థ
వీడియో, ఆడియో రూపంలో తరగతులు
కళాశాల చుట్టపక్కల ఉచితంగా ‘వైఫై’
ప్రత్యేక వెబ్‌సైట్‌లో కళాశాలల వివరాలు
త్వరలోనే 1,298 మంది లెక్చరర్ల నియామకం
ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే
బెంగళూరు : రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో మానవ వనరుల సమస్య పరిష్కారం, విద్యార్థులకు అవసరమైన సమాచారం అందించడానికి వీలుగా త్వరలో స్మార్ట్‌క్లాస్, వర్చువల్ క్లాస్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే తెలిపారు. విధాన సౌధాలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్‌క్లాస్ విధానంలో మొదటిగానే రికార్డు చేసిన లెక్షరర్ల పాఠశాలను ఆయా విషయాల (సబ్జెక్ట్స్) లెక్చరర్లు లేని కళాశాలల్లో వీడియో రూపం లో ప్రదర్శిస్తారన్నారు. ఈ విధానాన్ని మొదట గుల్బ ర్గా డివిజన్‌లో 50 కళాశాలల్లో అమలు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు (టెక్ట్స్‌బుక్స్), వ్యక్తిత్వ వికాస పుస్తకాలను వర్చువల్ క్లాస్ విధానంలో ఆడియో రూపంలో అందజేస్తామన్నారు. ఇందుకోసం ప్రతి కళాశాల చుట్టపక్కల 100 మీటర్ల వరకు ఉచిత వైఫై వ్యవస్థను కల్పించబోతున్నామని తెలిపారు.
మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఈ పుస్తకాలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలవుతుం దన్నారు. రాష్ట్రంలోని ప్రతి డిగ్రీ కళాశాల వివరాలను తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక వెబ్‌సైట్ వ్యవస్థను రూపొందిస్తామన్నారు. దీని వల్ల ఏఏ కళాశాల లో ఏఏ సదుపాయాలు ఉన్నయో తెలుసుకుని విద్యార్థులు కళాశాలను ఎంపిక చేసుకోవడానికి వీలవుతుందన్నారు. ఐదు వేల మంది డిగ్రీ విద్యార్థులకు స్కిల్‌డెవెల్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇందుకు సంబంధించిన పట్టాలను కూడా అందజేస్తామని తెలిపారు. దీని వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి ఆస్కారముంటుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలిటెక్కిక్ కళాశాలల్లో విద్యా ర్థి, విద్యార్థినులకు వేర్వేరుగా 44 హాస్టల్స్‌ను నిర్మించనున్నామని తెలిపారు. త్వరలోనే 1,298 మంది లెక్చరర్ల నియామక ప్రక్రియను రెండు మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. అంతేకాకుండా వీటికి అదనంగా 850 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి పూర్తయిందని, వీటి నియామక ప్రక్రియను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని వివరించారు.
ఇక స్మార్ట్ విద్య
Published Sun, Nov 23 2014 2:13 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement