మౌలిక సదుపాయాలా.. అవెక్కడ? | Tata Institute of Social Sciences Surveyon M-east ward | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాలా.. అవెక్కడ?

Published Fri, May 1 2015 11:37 PM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

Tata Institute of Social Sciences Surveyon M-east ward

- నగరంలోని ఎం- ఈస్ట్ వార్డ్‌లో దుర్భర పరిస్థితులు
సాక్షి, ముంబై:
నగరంలోని ఎం-ఈస్ట్ వార్డ్‌లో నివసిస్తున్న సుమారు 1.12 లక్షల మంది ప్రజలు కనీస మౌలిక సదుపాయలు పొందలేని స్థితిలో ఉన్నారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టీఐఎస్‌ఎస్) నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. నగరంలోని ఎం-ఈస్ట్ వార్డులో 72.5 శాతం జనాభా మురికి వాడల్లో నివసిస్తున్నారని, 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో సగం మంది నిరుద్యోగులున్నారని సర్వేలో వెల్లడైంది.

బీఎంసీ ఆధ్వర్యంలో ఇక్కడ 72 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని, కేవలం రెండు మాత్రమే సెకండరీ గ్రేడ్ పాఠశాలలు ఉన్నాయని తెలిసింది. వార్డులో పేదరికం వల్ల ఆదాయం తక్కువగా ఉందని, పట్టభద్రులు కూడా చిన్నాచితక పనుల చేసుకుంటూ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని టీఐఎస్‌ఎస్ ప్రొఫెసర్ అమితా భిడే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement