- జాతీయ జల అభివృద్ధి సంస్థకు స్పష్టం చేసిన సర్కారు
- గోదావరిలో 50శాతం, అంత కంటే తక్కువ డిపెండబులిటీ పరిగణనలోకి తీసుకోవాలంటూ లేఖ
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిలో 75 శాతం డిపెండబులిటీ ఆధారంగా నీటి లెక్కలను పరిగణించి, మిగులు జలాలను గుర్తిస్తామన్న జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టింది. ఆ నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. గోదావరిలో 50 శాతం డిపెండబులిటీ లేక అంతకంటే తక్కువ డిపెండబులిటీతో నీటి లెక్కలు తీసుకుని మిగులు జలాలను గుర్తించాలని డిమాండ్ చేసింది.
ఈ మేరకు అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు శుక్రవారం ఎన్‌డబ్ల్యూడీఏకు లేఖ రాశారు. నదుల అనుసంధానానికి సంబంధించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలపైనా లేఖలో అభ్యంతరం తెలిపారు. తెలంగాణలో ఉన్న కృష్ణా, గోదావరి నదుల్లో ట్రిబ్యునల్‌ల కేటాయింపుల మేరకు నీటి వినియోగం ఉందని.. ఎక్కడా మిగులు జలాలు లేవని స్పష్టం చేశారు. అయినప్పటికీ గోదావరిలో 50 శాతం డిపెండబులిటీ లెక్కల ఆధారంగా మిగులు జలాలు ఏవైనా ఉంటే వాటితో నదుల అనుసంధాన ప్రక్రియ చేపడితే అభ్యంతరం లేదని పేర్కొన్నారు.
75శాతం డిపెండబులిటీకి ఒప్పుకోం
Published Sun, Dec 11 2016 2:10 AM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM
Advertisement
Advertisement