తెలంగాణ తొలి క్యాష్ లెస్ గ్రామం ఇదే..
తెలంగాణ తొలి క్యాష్ లెస్ గ్రామం ఇదే..
Published Mon, Dec 5 2016 9:35 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
హైదరాబాద్: సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ దక్షిణ భారతదేశంలో తొలి క్యాష్ లెస్ గ్రామంగా అవతరించినట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ గ్రామాన్ని నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్ రావు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
ఇబ్రహీంపూర్ లో నివసించే 1200 మందికి బ్యాంకు అకౌంట్లతో పాటు డెబిట్ కార్డులు, స్వైపింగ్ మిషన్లు జారీ అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గ్రామంలో క్యాష్ లెస్ లావాదేవీలను పరిశీలించినట్లు చెప్పారు. మిగిలిన గ్రామాలకు ఇబ్రహీంపూర్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
Advertisement
Advertisement