వేగం పెంచిన ఉదయనిధి | Udhayanidhi Stalin has his hands full | Sakshi
Sakshi News home page

వేగం పెంచిన ఉదయనిధి

Published Mon, Feb 9 2015 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

వేగం పెంచిన ఉదయనిధి

వేగం పెంచిన ఉదయనిధి

యువ నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్ తన చిత్రాల వేగాన్ని పెంచారు. ఒరు కల్ ఒరు కన్నాడి చిత్రంతో కథా నాయకుడిగా తెరంగేట్రం చేసిన ఈయన ఆ చిత్రం విజయం సాధించినా ఇదు కదిర్ వేలన్ కాదల్ చిత్రం చేయడానికి రెండేళ్లకు పైగా సమయం తీసుకున్నారు. ఆ తరువాత నన్బేండా చిత్రం చేశారు. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ఒక పక్క ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తూనే, మరో పక్క తదుపరి చిత్రాల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సారి నెల గ్యాప్‌లో రెండు చిత్రాలు సెట్‌పైకి వెళ్లనుండడం విశేషం. అందులో ఒకటి ఎండ్రెండ్రుం పున్నగై చిత్ర దర్శకుడు అహ్మద్‌తో చేయనున్నారు.
 
 ఈ చిత్రానికి ఇదయం మురళి అనే పేరును నిర్ణయించారు. ఇందులో ఉదయనిధి స్టాలిన్ లవర్ బాయ్‌గా కనిపించనున్నారట. అయితే ఒక్క ప్రేమ కాదు స్నేహం గురించి కూడా ఇదయం మురళి చిత్రంలో చెప్పనున్నట్లు దర్శకుడు అహ్మద్ అంటున్నారు. ఉదయనిధి ఈ చిత్రంలో మూడు గెటప్‌లలో కనిపించనున్నారట. ఆయనింతకుముందెప్పుడూ చేయని సరికొత్త పాత్రను ఈ చిత్రంలో ధరించనున్నారట. కథ, కథనం చాలా ఫ్రెష్‌గా ఉంటాయని దర్శకుడంటున్నారు. ఈ చిత్రంలో నాయకి ఎవరన్నది బయటపెట్టకపోయినా చిత్ర షూటింగ్ మాత్రం మార్చి నెలలో ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ అంటున్నారు. ఉదయనిధి స్టాలిన్ తిరుకుమరన్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా ఐ ఫేమ్ అమీజాక్సన్ నటించనున్నారు. కీలక పాత్రలో సత్యరాజ్ నటించనున్న ఈ చిత్రం ఈ నెలలోనే సెట్‌పైకి వెళ్లనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement