హడలెత్తిస్తున్నతురకచెరువు
Published Fri, Sep 23 2016 4:00 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
నిజాంపేట: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. నిజాంపేటలోని తురకచెరువు ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఏక్షణానైనా చెరువుకు గండి పడే అవకాశాలు ఉన్నాయనే వార్తలు గుప్పుమనడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు చెరువుకట్ట దిగువ ప్రాంతమైన భండారీ లేఅవుట్‌లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే యత్నాలు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లలోని సెల్లార్, మొదటి అంతస్థుల్లో ఎవరు ఉండొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Advertisement
Advertisement