శ్రీనివాస్ మృతికి వైఎస్ జగన్ సంతాపం
శ్రీనివాస్ మృతికి వైఎస్ జగన్ సంతాపం
Published Fri, Feb 24 2017 7:54 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM
హైదరాబాద్: జాత్యహంకారంతో ఓ తెల్లజాతి దుండగుడు జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిబోట్ల మృతిచెందడంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా కాన్సాస్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేడసాని అలోక్‌కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
కాగా కన్సాస్ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. వీరిద్దరూ గార్నిమ్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అలోక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జేఎన్‌టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అలోక్ హైదరాబాద్‌లోని వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి కన్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరిలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఈ కాల్పుల్లో ఇయాన్ గ్రిల్లట్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డారు.
Advertisement
Advertisement