Srinivas Kuchibotla
-
ట్రంప్ ప్రసంగ కార్యక్రమంలో పాల్గొనండి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగ కార్యక్రమానికి (స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్) హాజరుకావాల్సిందిగా సునయన దుమాలకు ఆహ్వానం అందింది. జనవరి 30న ఉభయసభలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు. గతేడాది అమెరికాలోని ఓ బార్లో అమెరికా జాత్యహంకారి కాల్పుల్లో మృతి చెందిన తెలుగు సాఫ్ట్వేర్ శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయనను కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ యోడర్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ‘వ్యవస్థ వైఫల్యానికి సునయన చాలా శక్తిమంతమైన చిహ్నంగా నిలిచారు’ అని కెవిన్ చెప్పినట్లు ఓ మీడియా కథనంలో పేర్కొన్నారు. ‘అమెరికా అందరినీ ప్రేమతో స్వాగతిస్తుంది. ఇక్కడికి రావాలనుకుంటున్న అన్ని దేశాల వారికి ఈ సందేశం చేరాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను’అని కెవిన్ వివరించారు. -
అమెరికాతో స్నేహానికి భారత్ ప్రయత్నం
వాషింగ్టన్: అమెరికాలో భారతీయులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్ గురువారం అమెరికా జాతీయ భద్రతా సలహదారు లెఫ్టినెంట్ జనరల్ హెచ్ ఆర్ మెక్ మాస్టర్‌తో వైట్ హౌస్‌లో భేటి అయ్యారు. ఈ భేటిలోఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఉగ్రవాదం నిర్మూలన, విద్వేషపూరిత దాడులపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా భారత్-అమెరికా భద్రతా సంబంధాలు, రక్షణలో సహకారం తదితర ఒప్పందాలు జరిగాయి. ఆ తర్వాత వైట్ హౌస్ స్పీకర్ పాల్ ర్యాన్‌తో కూడా జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల అమెరికాలో చనిపోయిన భారత పౌరుడు శ్రీనివాస్ కూచిభోట్లకు నివాళులు అర్పించారు. ఇరు దేశాల ఆర్ధిక వ్యవహారాలు, రక్షణ సహకారాలపై చర్చించారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు ఇరుదేశాల బంధాలకు మూలాలని ర్యాన్ భేటి అనంతరం తెలిపారు. కొత్త అమెరికా ప్రభుత్వంలోని అధికారులను జయశంకర్ వరుసగా కలుస్తున్నారు. ఇరుదేశాల మధ్య స్నేహాపూర్వక వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది. -
ముగిసిన శ్రీనివాస్ అంత్యక్రియలు
హైదరాబాద్ : అమెరికాలో జాతి అహంకార కాల్పుల్లో మృతి చెందిన కూచిభోట్ల శ్రీనివాస్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి. మల్లంపేటలోని ఆయన నివాసం నుంచి జూబ్లిహిల్స్ మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగింది. శ్రీనివాస్‌కు బంధువులు, స్నేహితులు కన్నీటి వీడ్కోలు పలికారు. అమెరికాలో జాతి అహంకారం నశించాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. శ్రీనివాస్ భార్య, తల్లిదండ్రులు వర్షిణి, మధుసూదన్ లను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఆయన అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని సంతాపం తెలిపారు. అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’ -
కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో?
న్యూయార్క్: శ్వేతజాతి దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిబొట్ల వ్యవహారం అమెరికాలో తెలుగువారిని గట్టిగానే మేల్కొలిపింది. వరుసగా తెలుగువారిపై, భారతీయులపై జాతి వివక్ష పూరితమైన దాడులు జరుగుతుండటం పట్ల ఇప్పటికే బాహాటంగా తమ నిరసన వాణిని సోషల్ మీడియా, పత్రికల ద్వారా వెలిబుచ్చిన భారతీయ ముఖ్యంగా తెలుగు సమాజం ఇప్పుడు నేరుగా అమెరికా అధ్యక్ష భవనం నుంచి హామీ ప్రకటనకోసం ప్రయత్నం ప్రారంభించింది. ఇందుకోసం నేరుగా అధ్యక్ష భవనానికి తమ మొర వినిపించేందుకు ఇప్పటికే ఉన్న ఆన్లైన్ పోర్టల్ ‘వి ది పీపుల్’ ద్వారా ప్రస్తుతం జరిగిన ఘటనపై స్పందనగానీ, ఇక ముందు అలాంటివి జరగకుండా అనుసరించనున్న విధానాలపై వివరణ ఇవ్వాలంటూ కోరింది. ఇందు కోసం సంతకాల సేకరణ ప్రారంభించింది. ఫిబ్రవరి 24న జాతి వివక్షతో భారతీయ ఇంజనీర్లపై దాడులు జరుగుతున్నాయి అనే శీర్షిక పెట్టి ఎస్వీ అనే వ్యక్తి ఆన్లైన్ పిటిషన్ వేసి సంతకాల సేకరణ ప్రారంభించారు. శ్వేత సౌదం స్పందించాలంటే నెల రోజుల్లో దీనిపై కనీసం లక్ష సంతకాలు ఉండాలి. ప్రస్తుతం ఈ అంశంపై 3,023మంది సంతకాలు చేశారు. ఇంకా కొనసాగుతోంది. మార్చి 26నాటికి ఈ సంతకాల సంఖ్య లక్షకు చేరాల్సి ఉంటుంది. ఈ నెల (ఫిబ్రవరి) 22, కాన్సాస్‌లోని ఆస్టిన్ బార్లో ఓ అమెరికన్ దురహంకారి కాల్పులు జరపడంతో తెలుగువాడైన శ్రీనివాస్ కూచిబొట్ల చనిపోయాడు. మరో తెలుగు వ్యక్తి అలోక్ మాదసాని గాయపడ్డాడు. ఈ ఘటనపై మొత్తం తెలుగువారికే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపే వ్యక్తి మా దేశం నుంచి వెళ్లిపోండి అని అడిగి మరీ కాల్పులు జరపడం ముమ్మాటికి జాతి వివక్ష దాడిగానే పరిణించాలని, ఆ కోణంలోనే దర్యాప్తు చేయాలని అక్కడి తెలుగువారు డిమాండ్ చేస్తున్నారు. అలాకాకుండా దీనిని ఒక మాములు అంశంగా అమెరికా ప్రభుత్వం తీసుకుంటే బాధితుల కుటుంబాలకు న్యాయం జరగనట్లేనని వారు అంటున్నారు. మరోపక్క, ఈ ఘటనను ట్రంప్ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న కారణంగా ఆన్లైన్ పిటిషన్ వైట్ హౌస్‌కు చేశారు. (చదవండి: విద్వేషపు తూటా!) నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! వైట్‌హౌస్ సంప్రదాయాలు కాలరాస్తున్న ట్రంప్! -
శ్రీనివాస్ మృతికి వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్: జాత్యహంకారంతో ఓ తెల్లజాతి దుండగుడు జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిబోట్ల మృతిచెందడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా కాన్సాస్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేడసాని అలోక్‌కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. కాగా కన్సాస్ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. వీరిద్దరూ గార్నిమ్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అలోక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జేఎన్టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అలోక్ హైదరాబాద్‌లోని వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి కన్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరిలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఈ కాల్పుల్లో ఇయాన్ గ్రిల్లట్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. -
కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే
-
రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే
కాన్సాస్: అమెరికాలోని కాన్సాస్‌లో చోటు చేసుకున్న జాత్యహంకార కాల్పుల్లో ఓ అమెరికన్ పౌరుడు హీరో అయ్యాడు. కాల్పులకు కూడా భయపడకుండా దుండగుడిని కిందపడేసి బంధించే ప్రయత్నం చేశాడు. అతడి చేతులోని తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశాడు. అప్పటికే అతడి తుపాకీ నుంచి తొమ్మిది బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆ తూటాల్లో రెండు అతడి ఒంట్లోకి దూసుకెళ్లాయి. అందులో ఒకటి చాతీలోకి మరొకటి చేతిలోకి. వివరాల్లోకి వెళితే.. అమెరికా నేవీలో పనిచేసిన మాజీ సైనికుడు అడామ్ పురింటన్ (51) ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్ లో ఇద్దరు తెలుగువారిపై కాల్పులు జరిపాడు. తమ దేశాన్ని విడిచి వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తూ కాల్పులు కొనసాగించాడు. అదే సమయంలో అందులో బీర్ తాగేందుకు వచ్చిన ఇయాన్ గ్రిలియట్(24) వెంటనే పురింటన్పైకి దూకాడు. అతడిని తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు ట్రిగర్ నొక్కడంతో రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. అయినప్పటికీ అతడిపై విరోచితంగా పోరాడి కిందపడేశాడు. అయినప్పటికీ గాయాల కారణంగా గ్రిలియట్ స్పృహకోల్పోతుండగా పురింటన్ పారిపోయాడు. ఐదు గంటల అనంతరం పోలీసులు దుండగుడిని అరెస్టు చేశారు. స్పృహకోల్పోయిన గ్రిలియట్ను ఆస్పత్రికి తరలించగా అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వాస్తవానికి అతడు అడ్డుకోకుంటే అలోక్ కూడా చనిపోయే పరిస్థితి ఉండేదట. ‘ఇతరులు ఏం చేయాలో నేను సరిగ్గా అదే చేశాను. అతడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అతడు జాతి కూడా మాకు తెలియదు. కానీ మనందరం మనుషులం. నేను బ్రతికి బయటపడటం నిజంగా అదృష్టమే. ఇది చాలా గొప్ప విషయం. ఆ ఘటనను నేను వర్ణించలేను. అలోక్ మాదసాని నిన్న నన్ను పరామర్శించి వెళ్లాడు. అతడి భార్య ఐదు నెలల గర్భవతి అని చెప్పాడు. అతడికి ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది’ అంటూ గ్రిలియట్ ఆస్పత్రిలో బెడ్‌పై ఉండి మాట్లాడాడు. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
కాల్పుల ఘటన తెలిసి షాకయ్యాను
-
కాల్పుల ఘటన తెలిసి షాకయ్యాను: సుష్మా
న్యూఢిల్లీ: అమెరికాలో జాత్యహంకార దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ కూచిబొట్ల మృతిపట్ల కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబం ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన అలోక్ మాదసాని ఆస్పత్రి నుంచి ఇంకా డిశ్చార్జి అవ్వాల్సి ఉందని అక్కడి భారత రాయబారి తెలిపినట్లు సుష్మా చెప్పారు. గాయపడిన అలోక్‌కు సహాయం చేసేందుకు కాన్సుల్ ఆర్డీ జోషి, వైస్ కాన్సుల్ హర్పాల్ సింగ్ కాన్సాస్కు బయలుదేరినట్లు తెలిపారు. ఘటన పూర్తి వివరాలు తెలుసుకున్నానని, శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు. జాత్యహంకారంతో ఓ తెల్లజాతి దుండగుడు జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిబోట్ల అనే తెలుగు యువకుడు చనిపోగా.. అలోక్ మాదసాని అనే మరో యువకుడు గాయపడ్డాడు. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి
కన్సాస్: జాత్యహంకారంతో ఓ తెల్లజాతి దుండగుడు జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిబోట్ల మృతిచెందడంపై ఆయన పని చేస్తున్న కంపెనీ గార్మిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. శ్రీనివాస్ మృతదేహాన్ని తరలించేందుకు అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని కూడా స్పష్టం చేసింది. అమెరికాలో జాతి వివక్ష నెత్తికెక్కిన ఓ తెల్లజాతి దుండగుడు ఇద్దరు తెలుగు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ కూచిబొట్ల చనిపోగా మరో తెలుగు వ్యక్తి అలోక్ మాదసాని తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వారు పనిచేస్తున్న గార్మిన్ కంపెనీ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ లారీ మైనార్డ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ కంపెనీ తరుపున ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్ లో గత రాత్రి జరిగిన కాల్పుల్లో మన ఏవియేషన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ విభాగంలోలోని పనిచేస్తున్న శ్రీనివాస్ కూచిబొట్ల దురదృష్టవశాత్తు కన్నుమూశాడు. మరో సహచరుడు అలోక్ మాదసాని తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అలోక్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. శ్రీనివాస్ మృతిపట్ల కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది. వారి కుటుంబాలకు ధైర్యంగా ఉండాలి. మేం వారికి అండగా ఉంటాం’ అని ఆ ప్రకటనతో తెలిపారు. కన్సాస్ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. వీరిద్దరూ గార్నిమ్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అలోక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జేఎన్టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అలోక్ హైదరాబాద్‌లోని వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి కన్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరిలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఈ కాల్పుల్లో ఇయాన్ గ్రిల్లట్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. సంబంధిత మరిన్ని కథనాలకై చదవండి.. అమెరికాలో జాతి విద్వేష కాల్పులు -
అమెరికాలో కాల్పులు : తెలుగు వ్యక్తి మృతి
-
అమెరికాలో జాతి విద్వేష కాల్పులు
► తెలుగు ఇంజనీర్ మృతి ► మరో తెలుగు వ్యక్తికి తీవ్ర గాయాలు ► బార్లో కాల్పులకు తెగబడిన దుండగుడు ► మా దేశం నుంచి వెళ్లిపోండి అంటూ వ్యాఖ్యలు కన్సాస్: అమెరికాలో జాతి వివక్ష నెత్తికెక్కిన ఓ తెల్లజాతి దుండగుడు ఇద్దరు తెలుగు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఇందులో ఒకరు మరణించారు. మృతుడిని శ్రీనివాస్ కూచిబొట్లగా గుర్తించారు. మరో తెలుగు వ్యక్తి అలోక్ మాదసాని తీవ్రంగా గాయపడ్డారు. కన్సాస్ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. వీరిద్దరూ గార్నిమ్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అలోక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జేఎన్టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అలోక్ హైదరాబాద్‌లోని వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి కన్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరిలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఈ కాల్పుల్లో ఇయాన్ గ్రిల్లట్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. ‘మా దేశం నుంచి వెళ్లిపోండి..’ ‘ఉగ్రవాదులారా.. ’ అంటూ జాత్యహంకార వ్యాఖ్యలతో దుండగుడు దూషించాడు. దీంతో బార్ యాజమాన్యం కలుగజేసుకొని అతడిని బయటకు పంపింది. కాసేపటికే అతడు తిరిగి వచ్చి తుపాకీతో వీరిపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఘటనకు సంబంధించి ఆడమ్ పూరింటన్ అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 15 రోజుల్లో అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తెలుగు వారు మృతి చెందారు. ఈ నెల 12న కాలిఫోర్నియాలో వరంగల్‌కు చెందిన వంశీరెడ్డి ఓ యువతిని కాపాడబోయే ప్రయత్నంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ( చదవండి : అమెరికాలో వరంగల్ విద్యార్థి హత్య )