ట్రంప్‌ ప్రసంగ కార్యక్రమంలో పాల్గొనండి | Wife of Indian man who was killed in Kansas invited to Trump’s State of the Union address | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ప్రసంగ కార్యక్రమంలో పాల్గొనండి

Published Sat, Jan 13 2018 3:31 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Wife of Indian man who was killed in Kansas invited to Trump’s State of the Union address - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రసంగ కార్యక్రమానికి (స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌ అడ్రస్‌) హాజరుకావాల్సిందిగా సునయన దుమాలకు ఆహ్వానం అందింది. జనవరి 30న ఉభయసభలను ఉద్దేశించి ట్రంప్‌  ప్రసంగించనున్నారు. గతేడాది అమెరికాలోని ఓ బార్‌లో అమెరికా జాత్యహంకారి కాల్పుల్లో మృతి చెందిన తెలుగు సాఫ్ట్‌వేర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల భార్య సునయనను కాంగ్రెస్‌ సభ్యుడు కెవిన్‌ యోడర్‌ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ‘వ్యవస్థ వైఫల్యానికి సునయన చాలా శక్తిమంతమైన చిహ్నంగా నిలిచారు’ అని కెవిన్‌ చెప్పినట్లు ఓ మీడియా కథనంలో పేర్కొన్నారు. ‘అమెరికా అందరినీ ప్రేమతో స్వాగతిస్తుంది. ఇక్కడికి రావాలనుకుంటున్న అన్ని దేశాల వారికి ఈ సందేశం చేరాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను’అని కెవిన్‌ వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement