గ్రీన్‌కార్డు ‘కోటా’ తొలగించాలి
అమెరికా రిపబ్లికన్ సభ్యుడు కెవిన్
వాషింగ్టన్: అమెరికాలో తాత్కాలిక వీసాపై ఉద్యోగం చేస్తున్న విదేశీయులకు నైపుణ్యం, దరఖాస్తుల ఆధారంగా గ్రీన్‌కార్డులు(శాశ్వత నివాస ధ్రువీకరణ) మంజూరు చేయాలని, ప్రస్తుతమున్న కోటా విధానాన్ని రద్దు చేయాలని అమెరికన్ చట్టసభ ప్రముఖుడొకరు డిమాండ్ చేశారు. ప్రతీ దేశానికి ఒకే నిష్పత్తిలో కేటాయింపు కారణంగా భారత్, చైనా వంటి దేశాలకు చెందిన వృత్తి నిపుణులకు కేటాయింపులో అన్యాయం జరుగుతుందని రిపబ్లికన్ సభ్యుడు కెవిన్ యోదెర్ అన్నారు.
ట్రంప్‌పై అభిశంసన తీర్మానం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిశంసనకు సంబంధించి తొలి ఆర్టికల్(ఆర్టికల్ ఆఫ్ ఇంపీచ్మెంట్)ను డెమొక్రాట్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ ప్రవేశపెట్టారు. అమెరికా ఎన్నికల్లో రష్యా పాత్రకు సంబంధించి సాగుతున్న విచారణకు ట్రంప్ విఘాతం కల్గించారని ఆరోపిస్తూ ప్రతినిధుల సభలో ఆయన పెట్టిన తీర్మానంపై మరో డెమొక్రాట్ సభ్యుడు అల్ గ్రీన్ సంతకం చేశారు.
పారిస్ ఒప్పందంపై నిర్ణయం మారొచ్చేమో: ట్రంప్
పారిస్: పారిస్ వాతావరణ ఒప్పందంపై తన నిర్ణయం మారొచ్చేమోనని ట్రంప్ గురువారం అన్నారు. ‘ఒప్పందంపై ఏదో ఒకటి జరగొచ్చు. చూద్దాం ఏమవుతుందో’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ తర్వాత ట్రంప్ వ్యాఖ్యానించారు.