అమెరికాలో కాల్పులు : తెలుగు వ్యక్తి మృతి | firing in america kansas state, telugu people died | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 24 2017 6:46 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

అమెరికాలో జాతి వివక్ష నెత్తికెక్కిన ఓ తెల్లజాతి దుండగుడు ఇద్దరు తెలుగు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఇందులో ఒకరు మరణించారు. మృతుడిని శ్రీనివాస్‌ కూచిబొట్లగా గుర్తించారు. మరో తెలుగు వ్యక్తి అలోక్‌ మాదసాని తీవ్రంగా గాయపడ్డారు. కన్సాస్‌ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. వీరిద్దరూ గార్నిమ్‌ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అలోక్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జేఎన్‌టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్‌ అమెరికాలోని టెక్సాస్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement