అమెరికాలో జాత్యహంకార దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ కూచిబొట్ల మృతిపట్ల కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబం ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన అలోక్ మాదసాని ఆస్పత్రి నుంచి ఇంకా డిశ్చార్జి అవ్వాల్సి ఉందని అక్కడి భారత రాయబారి తెలిపినట్లు సుష్మా చెప్పారు