
కొల్లాపూర్: నల్లమల అటవీ ప్రాంతంలో వెదురు బొంగుల నరికివేతపై ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధాన్ని విధించిందని కొల్లాపూర్ ఫారెస్టు రేంజర్ మనోహర్ వెల్లడించారు. ఈమేరకు ఇటీవలే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయని పేర్కొన్నారు. అడవిలో ఎవరైనా అక్రమంగా వెదురు బొంగులను నరికితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వెదురు బొంగుల నరికివేతను పూర్తిస్థాయిలో నిలువరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడవుల పరిరక్షణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని రేంజర్ కోరారు.