శాంసంగ్ మొబైల్ ఫెస్ట్: దండీగా ఎక్స్చేంజ్ ఆఫర్స్ | Flipkart hosts Samsung Mobiles Fest from April 11 to 13; offers discounts | Sakshi
Sakshi News home page

శాంసంగ్ మొబైల్ ఫెస్ట్: దండీగా ఎక్స్చేంజ్ ఆఫర్స్

Published Wed, Apr 12 2017 6:18 PM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM

శాంసంగ్ మొబైల్ ఫెస్ట్: దండీగా ఎక్స్చేంజ్ ఆఫర్స్ - Sakshi

శాంసంగ్ మొబైల్ ఫెస్ట్: దండీగా ఎక్స్చేంజ్ ఆఫర్స్

ఇటీవలే ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ తో షియోమి స్మార్ట్ ఫోన్ వినియోగదారులను మైమరిపించిన సంగతి తెలిసిందే. షియోమి తర్వాత వెంటనే దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ కూడా మొబైల్ ఫెస్టివల్ కు తెరలేపింది. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తో కలిసి శాంసంగ్ మూడు రోజుల పాటు మొబైల్ ఫెస్ట్ ను నిర్వహిస్తోంది. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 13 వరకు ఫ్లిప్ కార్ట్ పై ఈ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ ఫెస్ట్ లో భాగంగా శాంసంగ్ ఫోన్లపై డిస్కౌంట్లు, భారీ ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రవేశపెట్టారు.
 
గెలాక్సీ ఆన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ పై కంపెనీ భారీ  ఎక్స్చేంజ్ ఆఫర్ ను ప్రకటించింది. 18,490 రూపాయలు కలిగిన ఈ ఫోన్ ను 3 వేల రూపాయల డిస్కౌంట్ పై 15,490లకు అందుబాటులోకి తెచ్చింది. అదే ఎక్స్చేంజ్ పై అయితే రూ.14,500 ధరను తగ్గిస్తోంది. ఈ మొబైల్ ఫెస్టివల్ లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ జే5 ధర రూ.10,990నే. ఈ ఫోన్ పై  కూడా ఎక్స్చేంజ్ పై 10వేల రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ జే5 అసలు ధర రూ.13,290.
 
ఎలాంటి ఈఎంఐ ధరలు లేకుండా ప్రారంభ ధర 1722 రూపాయలకు శాంసంగ్ ఫోన్లను పొందవచ్చు. ఇలా మిగతా శాంసంగ్ ఫోన్లు గెలాక్సీ ఆన్7, గెలాక్సీ ఆన్8, గెలాక్సీ ఆన్9, గెలాక్సీ సీ9ప్రొ పై కూడా కంపెనీ ఎక్స్చేంజ్, డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. దీనిలో భాగంగా టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ కూడా 1జీబీ డేటా ఖరీదుపై 14జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. అయితే ఎక్స్చేంజ్ ఏ ఫోన్ తో చేసుకోవాలో కంపెనీ తెలుపలేదు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement