మోటో ఎక్స్‌4 లాంచ్‌, ఫీచర్లు అదుర్స్‌ | Motorola Moto X4 Launched With Dual Camera, Amazon Alexa, Google Assistant Support | Sakshi
Sakshi News home page

మోటో ఎక్స్‌4 లాంచ్‌, ఫీచర్లు అదుర్స్‌

Published Fri, Sep 1 2017 1:55 PM | Last Updated on Sun, Sep 17 2017 6:15 PM

మోటో ఎక్స్‌4 లాంచ్‌, ఫీచర్లు అదుర్స్‌

మోటో ఎక్స్‌4 లాంచ్‌, ఫీచర్లు అదుర్స్‌

బెర్లిన్‌ : మోటో ఎక్స్‌ లైనప్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మోటోరోలా లాంచ్‌ చేసింది.  బెర్లిన్‌లో ఐఎఫ్‌ఏ 2017 ఈవెంట్‌లో మోటో ఎక్స్‌4 ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. తొలుత ఈ స్మార్ట్‌ఫోన్‌ యూరోప్‌లో అందుబాటులోకి రానుంది. తర్వాత ఇతర మోటోరోలా మార్కెట్లలోకి వస్తుంది. దీని ధర 399 యూరోలు అంటే సుమారు 30,400 రూపాయలు. ఈ నెలలో ఇది యూరప్‌లో విక్రయానికి వస్తుంది. భారత్‌లో ఇంకా విడుదల తేదీలు ఖరారు కాలేదు. భారత్‌లో దీని ధర తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది.  
 
మోటోరోలా మోటో ఎక్స్‌ 4 ఫీచర్లు.. 
5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 630 చిప్‌సెట్‌
3 జీబీ, 4జీబీ ర్యామ్‌
32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
2టీబీ వరకు విస్తరణ మెమరీ
వెనుకవైపు 12 మెగాపిక్సెల్‌, 8 మెగాపిక్సెల్‌తో డ్యూయల్‌ కెమెరా సెటప్‌
16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
అమెజాన్‌ అలెక్సా, వాయిస్‌ సెర్చ్‌ కోసం గూగుల్‌ అసిస్టెంట్‌, ఐపీ68 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ సపోర్టు
హోమ్‌ బటన్‌ వద్ద ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌
యూఎస్‌బీ టైప్‌-సీ పోర్టు
3.5ఎంఎం ఆడియో జాక్‌
మెటల్‌ బాడీ
స్టెర్లింగ్‌ బ్లూ, సూపర్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటు
3000ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement