మోటో ఎక్స్‌4 ధర భారీగా తగ్గింది | Moto X4 3GB RAM Variant Gets A Price Cut In India | Sakshi
Sakshi News home page

మోటో ఎక్స్‌4 ధర భారీగా తగ్గింది

Published Fri, Sep 28 2018 9:16 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

Moto X4 3GB RAM Variant Gets A Price Cut In India - Sakshi

మోటో ఎక్స్‌4 స్మార్ట్‌ఫోన్‌

లెనోవోకు చెందిన మోటోరోలా తన మోటో ఎక్స్‌4 స్మార్ట్‌ఫోన్‌ ధరను తగ్గించింది. 3జీబీ ర్యామ్‌, 4జీబీ ర్యామ్‌, 6జీబీ ర్యామ్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న వేరియంట్లలో, 3జీబీ ర్యామ్‌ మోడల్‌పై ధర తగ్గించినట్టు తెలిసింది. 3జీబీ ర్యామ్‌ మోడల్‌ ధరను రూ.7000 తగ్గించి, రూ.13,999కు అందుబాటులోకి తెచ్చింది. అంతకముందు ఈ వేరియంట్‌ ధర 20,999 రూపాయలుగా ఉంది. అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్‌ సైటులో 3జీబీ ర్యామ్‌, 4జీబీ ర్యామ్‌ రెండు వేరియంట్లలో ధర తగ్గినట్టు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్‌ ఆ మోడల్స్‌పై 5000 రూపాయల ధర తగ్గించినట్టు వెల్లడైంది. అంటే ఫ్లిప్‌కార్ట్‌ 3జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ.15,999కు, 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను 17,999 రూపాయలకు అందుబాటులో ఉంచింది. 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర 22,999 రూపాయలుగా ఉన్న సంగతి తెలిసిందే. 
మరోవైపు అమెజాన్‌ సైట్‌లో కూడా మోటో ఎక్స్‌4 లిస్ట్‌ అయింది. 3జీబీ వేరియంట్‌ 13,744 రూపాయలకు, 4జీబీ వేరియంట్‌ 15,767 రూపాయలకు, 6జీబీ వేరియంట్‌ 19,998 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. 

మోటో ఎక్స్‌4 స్పెషిఫికేషన్లు...
డ్యూయల్‌ సిమ్‌(నానో)
ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌
5.2 అంగుళాల హెచ్‌డీ ఎల్‌టీపీఎస్‌ ఐపీఎస్‌ డిస్‌ప్లే
కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌
ఆక్టా-కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 630 ఎస్‌ఓసీ
12 మెగాపిక్సెల్‌, 8 మెగాపిక్సెల్‌తో డ్యూయల్‌ బ్యాక్‌ కెమెరా
 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు విస్తరణ మెమరీ
3000 ఎంఏహెచ్‌ నాన్‌-రిమూవబుల్‌ ఆల్‌-డే బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement