Motorola Moto X4
-
మోటో ఎక్స్4 ధర భారీగా తగ్గింది
లెనోవోకు చెందిన మోటోరోలా తన మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న వేరియంట్లలో, 3జీబీ ర్యామ్ మోడల్‌పై ధర తగ్గించినట్టు తెలిసింది. 3జీబీ ర్యామ్ మోడల్ ధరను రూ.7000 తగ్గించి, రూ.13,999కు అందుబాటులోకి తెచ్చింది. అంతకముందు ఈ వేరియంట్ ధర 20,999 రూపాయలుగా ఉంది. అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్ సైటులో 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ రెండు వేరియంట్లలో ధర తగ్గినట్టు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్ ఆ మోడల్స్‌పై 5000 రూపాయల ధర తగ్గించినట్టు వెల్లడైంది. అంటే ఫ్లిప్‌కార్ట్ 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.15,999కు, 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను 17,999 రూపాయలకు అందుబాటులో ఉంచింది. 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర 22,999 రూపాయలుగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు అమెజాన్ సైట్లో కూడా మోటో ఎక్స్4 లిస్ట్ అయింది. 3జీబీ వేరియంట్ 13,744 రూపాయలకు, 4జీబీ వేరియంట్ 15,767 రూపాయలకు, 6జీబీ వేరియంట్ 19,998 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. మోటో ఎక్స్4 స్పెషిఫికేషన్లు... డ్యూయల్ సిమ్(నానో) ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ 5.2 అంగుళాల హెచ్డీ ఎల్టీపీఎస్ ఐపీఎస్ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 630 ఎస్ఓసీ 12 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్‌తో డ్యూయల్ బ్యాక్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు విస్తరణ మెమరీ 3000 ఎంఏహెచ్ నాన్-రిమూవబుల్ ఆల్-డే బ్యాటరీ -
మోటో ఎక్స్4 లాంచ్, ఫీచర్లు అదుర్స్
బెర్లిన్ : మోటో ఎక్స్ లైనప్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మోటోరోలా లాంచ్ చేసింది. బెర్లిన్‌లో ఐఎఫ్ఏ 2017 ఈవెంట్లో మోటో ఎక్స్4 ను మార్కెట్లోకి విడుదల చేసింది. తొలుత ఈ స్మార్ట్‌ఫోన్ యూరోప్‌లో అందుబాటులోకి రానుంది. తర్వాత ఇతర మోటోరోలా మార్కెట్లలోకి వస్తుంది. దీని ధర 399 యూరోలు అంటే సుమారు 30,400 రూపాయలు. ఈ నెలలో ఇది యూరప్‌లో విక్రయానికి వస్తుంది. భారత్‌లో ఇంకా విడుదల తేదీలు ఖరారు కాలేదు. భారత్‌లో దీని ధర తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. మోటోరోలా మోటో ఎక్స్ 4 ఫీచర్లు.. 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 630 చిప్సెట్ 3 జీబీ, 4జీబీ ర్యామ్ 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 2టీబీ వరకు విస్తరణ మెమరీ వెనుకవైపు 12 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమెజాన్ అలెక్సా, వాయిస్ సెర్చ్ కోసం గూగుల్ అసిస్టెంట్, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సపోర్టు హోమ్ బటన్ వద్ద ఫింగర్‌ప్రింట్ స్కానర్ యూఎస్బీ టైప్-సీ పోర్టు 3.5ఎంఎం ఆడియో జాక్ మెటల్ బాడీ స్టెర్లింగ్ బ్లూ, సూపర్ బ్లాక్ రంగుల్లో అందుబాటు 3000ఎంఏహెచ్ బ్యాటరీ -
లాంచింగ్‌కు సిద్ధమైన మోటో ఎక్స్4, ఫీచర్లివే!
మోటోరోలా మోటో ఎక్స్ లైనప్‌లో ఎంతో కాలంగా వేచిచూస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 2న మార్కెట్లోకి రాబోతుంది. మోటో ఎక్స్4 విడుదల తేదీను మోటోరోలా అధికారికంగా ప్రకటించింది. మోటోరోలా ఫిలిప్పీన్స్ ఫేస్బుక్ పేజీలో తాజాగా పోస్టు చేసిన పోస్టర్లో లాంచ్ ఈవెంట్ సాయంత్రం ఆరు గంటలకు ఉండబోతుందని మోటోరోలా తెలిపింది. ఫిలిప్పీన్స్‌లో ''హలోమోటోఎక్స్'' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు సుమారు 26వేల రూపాయలుగా ఉంబోతుందని టాక్. రెండు వేరియంట్లలో ఇది విడుదల కాబోతుంది. మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఓఎస్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ గొర్రిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ 12 ఎంపీ రియర్ కెమెరాలు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరణ మెమరీ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ