సమ్మెలోకి ఉద్యోగులు
నిలిచిపోయిన సర్వీసులు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం
ఆపదలో ఉన్నవారిని క్షణాల్లో ఆస్పత్రికి తరలించే అపర సంజీవని ఆగిపోయింది. 108
సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని, గత సమ్మెకా లంలో తొలగించిన ఉద్యోగు
లను తిరిగి విధుల్లోకి తీసుకో వాలని తదితర డిమాండ్లతో సిబ్బంది సమ్మెకు దిగారు.
నల్లగొండ టౌన్
ఆపదలో ఉన్నవారిని క్షణాల్లో ఆస్పత్రికి తరలించే అపర సంజీవని ఆగిపోయింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిస్కరించాలని డిమాండ్ చేస్తూ 108 ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. జీవీకే యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకకించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 36 అంబులెన్స్‌లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. 108 సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని, గతంలో సమ్మెకాలంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోవాలని, కనీసం వేతనం చట్టాన్ని అమలు చేస్తూ నెలకు రూ.20 వేతనాలను చెల్లించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, పనిగంటల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. అయితే జిల్లాలోని 36 అంబులెన్స్‌లకు సంబంధించిన టెక్నీషియన్‌లు, పెలైట్లు కలిపి 144 మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
అత్యవసర సేవలకు అంతరాయం లేదు
108 ఉద్యోగులు పూర్తిస్థాయిలో సమ్మెలోకి వె ళ్లనప్పటికీ అత్యవసర సేవలకు అంతరాయ కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి అంబులెన్స్‌లను నడిపిస్తున్నామని 108 సేవలను జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమ నాగేందర్ తెలిపారు. గతంలో శిక్షణ పొందిన డ్రైవర్లు, 104 వాహనాల డ్రైవర్లను, వైద్య ఆరోగ్య శాఖ పారామెడికల్ ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటున్నాము. అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాము.
108 ఉద్యోగుల ర్యాలీ
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమ్మెలోకి వెళ్లిన తమకు అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు మద్దతు తెలపాలని కోరుతూ గురువారం స్థానిక గడియారం సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు 108 ఉద్యోగులు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ 108 ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తొంట భాస్కర్ మాట్లాడుతూ తాము సమ్మెలోకి వె ళ్లడడంతో అనుభవం లేని డ్రైవర్లు, సిబ్బందితో వాహనాలను నడిపించడం దారుణమన్నారు. పేదల జీవితాలతో చెలగాటమాడడం మానుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నగేష్, రాజు, సత్యనారాయణ, కోటేష్, చంద్రమోహన్, వెంకన్న, మల్లేష్, చారి, సరేష్, సతీష్, రమేష్, సంజీవరెడ్డి, సైదులు, నిరంజన్, శ్రీను, పవన్, వెంకట్రాములు, నరేష్, స్టాలిన్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.
ఆగిన 108
Published Fri, May 15 2015 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM
Advertisement