నల్గొండ: వేగంగా వస్తున్న కారు ముందు వెళ్తోన్న బైకును ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పాతమనుగుండ్ల గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పరిడ మండలానికి చెందిన మాగి బిక్షం(58), కోనేటి యాదయ్య(55), సత్యనారాయణ కట్టె వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం పాత మనుగుండ్లకు వచ్చి వెళ్తున్న సమయంలో ద్విచక్రవాహనం గ్రామ శివారులోకి చేరుకున్న వెంటనే వెనక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బిక్షం, యాదయ్య అక్కడికక్కడే మృతిచెందారు. సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.