మహబూబ్‌నగర్ టౌన్ : జిల్లాలోని ప్రాజెక్ట్‌లను వేగవంతంగా పూర్తి చేసి ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఖరీఫ్‌లో 3.7లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిందిగా సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్‌లపై శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో స మీక్షించారు. ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్ట్‌ల ద్వారా నిర్ధేశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఈ విషయంలో ఎలాంటి ఇ బ్బందులు లేకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ ప్రకారం ముందుకు వెళ్లాల్సిందిగా అధికారులకు సూచించారు. ఇందుకుగాను ప్రాజెక్ట్‌ల పనులు పూర్తికాకుండా ఏర్పడిన అడ్డంకులను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ విషయంలో అక్కడక్కడ రైల్వే క్రాసింగ్ కారణంగా సమస్యలు ఏర్పడ్డాయని, వాటికి సంబంధించి తాను రైల్వే అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానన్నారు.
ఇక భూసేకరణ విషయంలో కొత్తగా ప్రవేశపెట్టిన చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి భూసేకరణను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో రైతులతో సమావేశాలు నిర్వహించి వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సమస్యలను పరిష్కరించాలని మంత్రి పేర్కొన్నారు. తాను జిల్లాకు రెండుసార్లు వచ్చిన సమయంలో పరిశీలించిన సమస్యలతోపాటు, చేపట్టాలని సూచించిన పనులను తక్షణమే పరిష్కరించాల్సిందిగా వారికి సూచించారు. అదే విధంగా కొత్తగా చేపట్టేబోయే పనులకు సంబంధించి రూపొందించిన నివేధికలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి తెలిపారు. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఖగేందర్, ప్రత్యేక కలెక్టర్ వనజాదేవి, తదితరులు పాల్గొన్నారు.
3.7లక్షల ఎకరాలకు సాగునీరు
Published Sat, Feb 7 2015 1:40 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement