శీనన్నకు అపూర్వ స్వాగతం | a grand welcome to ponguleti srinivas | Sakshi
Sakshi News home page

శీనన్నకు అపూర్వ స్వాగతం

Published Sun, Jun 8 2014 1:40 AM | Last Updated on Sat, Mar 9 2019 3:08 PM

శీనన్నకు అపూర్వ స్వాగతం - Sakshi

శీనన్నకు అపూర్వ స్వాగతం

ఖమ్మం హవేలి/కూసుమంచి, న్యూస్‌లైన్: ఖమ్మం లోక్‌సభ సభ్యునిగా పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా జిల్లాకు వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి శనివారం జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు.  అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ... ఆనందోత్సాహాలతో బాణసంచా కాలుస్తూ...కేరింతలు కొడుతూ యువకులు నినాదాలు చేయగా, మహిళలు ఆత్మీయ హారతి ఇచ్చి శీనన్నను స్వాగతించారు.
 
జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్‌గూడెంకు పొంగులేటి చేరుకోగానే జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎదురేగి ఘన స్వాగతం పలికాయి. పార్టీ ఎమ్మెల్యేలు  పాయం వెంక టేశ్వర్లు, బాణోత్ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల సమన్వయకర్తలు కూరాకుల నాగభూషణం, మట్టా దయానంద్‌లతో పాటు జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పొంగులేటికి ఘనస్వాగతం పలికారు. పార్టీ నాయకులు సాధు రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఎంపీని  కార్యకర్తలు సత్కరించారు.
 
పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి  ఆధ్వర్యంలో మహిళా నాయకులు   తెలంగాణ సంసృ్కతి , సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మలతో, హారతులతో పొంగులేటికి అపూర్వ స్వాగతం పలికారు. గుమ్మడి కాయలతో దిష్టితీశారు. పార్టీ యువజన విభాగం  జిల్లా అధ్యక్షులు ఎండి ముస్తాఫా, నగర అధ్యక్షులు అశోక్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు  భారీగా బాణసంచా పేలుస్తూ పొంగులేటికి స్వాగతం పలికారు. అనంతరం భారీ వాహనాల ర్యాలీతో పొంగులేటి  ముందుకు సాగారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనపై పూలవర్షం కురిపించారు. జై జగన్, జై పొంగులేటి అంటూ నినాదాలను హోరెత్తించారు.  
 
 నాయకన్‌గూడెంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి,  అంబేద్కర్,మహాత్మాగాంధి, కూసుమంచిలో అంబేద్కర్ విగ్రహాలకు ఎంపీ పొంగులేటి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. అనంతరం   పాలేరు, కూసుమంచి, వరంగల్‌క్రాస్‌రోడ్డు, నాయుడుపేట మీదుగా భారీ ప్రదర్శనగా ఎంపీ ఖమ్మం చేరుకున్నారు.ఖమ్మం నగరంలోని కాల్వొడ్డులో నాయకులు, కార్యకర్తలు పొంగులేటిపై పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి జూబ్లీక్లబ్, మయూరిసెంటర్, వైరారోడ్డు, జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, రోటరీనగర్ మీదుగా పార్టీ జిల్లా కార్యాలయానికి ప్రదర్శన రాత్రి 9 గంటలకు చేరుకుంది. నగరంలో ప్రదర్శన పొడవునా శీనన్నకు ప్రజలు  నీరాజనం పలికారు.
 
 అడుగడుగునా పూలవర్షం కురిపించారు. ఎంపీ పొంగులేటి ప్రతి ఒక్కరికీ అప్యాయంగా అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. జనసందోహం భారీగా ఉండడంతో ప్రదర్శన కాల్వొడ్డు, మయూరిసెంటర్‌నుంచి పార్టీ కార్యాలయం వరకు నెమ్మదిగా సాగింది. ప్రతి కూడలిలో పొంగులేటికి పలువురు అభిమానులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. జెడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి  పూలమాల వేసి ఎంపీ నివాళులర్పించారు. ప్రదర్శనలో భాగంగా ఆద్యంతం నాయకులు, అభిమానులు, కార్యకర్తలు నృత్యాలు చేశారు.  పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఎంపీకి పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యాలయానికి చేరుకున్న వెంటనే ఆయన వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
 
ప్రదర్శన ఆద్యంతం నగరట్రాఫిక్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎంపీ పొంగులేటికి స్వాగతం పలికి, ప్రదర్శనలో పాల్గొన్న వారిలో   వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి,  బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తోట రామారావు, నాయకులు ఆకులమూర్తి, కొత్తగుండ్ల శ్రీలక్ష్మీ, కూసుమంచి మండల కన్వీనర్ బజ్జూరి వెంకటరెడ్డి, జిల్లా నాయకులు ముప్పాని శ్రీకాంత్‌రెడ్డి,  జర్పుల బాలాజీ నాయక్, పిట్టా సత్యనారాయణ రెడ్డి,  అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మార్కం లింగయ్యగౌడ్, జిల్లేపల్లి సైదులు, దొడ్డా శ్రీనివాస్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్, కోటి సైదారెడ్డి,  దేవరపల్లి శ్రీనివాసరెడ్డి,  సంగీత, త్రివేణి, శ్రీలక్ష్మీ,  నాయకన్‌గూడెం సర్పంచ్  దేవర అమల, ఎంపీటీసీలు అలింగ గోవిందరెడ్డి, బారి శ్రీనివాస్, పులుసు మల్లేష్, సర్పంచ్ కందాళ రవి, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్  మండల నాయకులు ఉన్నారు.
 
ఆకట్టుకున్న భారీ వాహన ర్యాలీ...
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అపూర్వ స్వాగతం పలుకుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ వాహనాల ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. వందలాది వాహనాలతో పొంగులేటి రథం ముందుకు సాగుతుంటే  కార్యకర్తల్లో పట్టరాని ఆనందం నెలకొంది. రథంలో ఎంపీ పొంగులేటితో పాటు ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, మదన్‌లాల్, ఖమ్మం, సత్తుపల్లి నియోజక వర్గాల సమన్వయకర్తలు కూరాకుల నాగభూషణం,  మట్టా దయానంద్, పార్టీ అధికార ప్రతినిథి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, యువజన విభాగం మూడు జిల్లాల కోఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి, బీసీ విభాగం నాయకులు తోట రామారావు, తదితరులు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement