న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు వేలం పాటలు జోరందుకున్నాయి. గ్రామాలలో ఈ స్థానాలకు పోటీ ఏర్పడిన నేపథ్యంలో గ్రామ పెద్దలు వేలం పాటలు నిర్వహించ టం, ఎక్కువ డబ్బులు చెల్లించినవారికి పదవులు కట్టబెట్టడం సర్వ సాధారణంగా మారింది. గ్రామస్తులు తీర్మానం చేసుకున్న ప్ర కారం వేలం పాటలో పదవిని దక్కించుకు న్న వ్యక్తికి పోలింగ్ రోజు ఓట్లు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి కూడా పలు గ్రామాలలో సోమవా రం ఎంపీటీసీ స్థానాలకు వేలం పాటలను నిర్వహించారు.సమాచారం అందుకున్న పోలీ సులు, అధికారులు వెళ్లేలోపు చాలా గ్రామాల లో వేలంపాట తంతును పూర్తి చేసుకున్నట్లు స మాచారం. పలు గ్రామాలలో జరిగిన వేలం పాటల వివరాలు ఇలా ఉన్నాయి.
రూ. 3.50 లక్షలకు
బాల్కొండ : బాల్కొండ మండలం నాగంపేట్ ఎంపీటీసీ స్థానానికి సోమవారం గ్రామస్తులు వేలం నిర్వహించినట్లు తెలిసింది. ఈ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో గ్రా మానికి చెందిన టీడీపీ నాయకుడు తన తల్లిని అభ్యర్థిగా నిలబెడుతూ రూ. 3.50 లక్షలకు వే లం పాటలో పదవి దక్కించుకున్నట్లు తెలిసిం ది. అయితే సమాచారం అందుకున్న తహశీల్దార్ పండరీనాథ్, ఆర్మూర్ రూర ల్ సీఐ గోవర్ధనగిరి, ఎస్‌ఐ సురేశ్ గ్రామానికి వెళ్లి విచారించగా ఎలాంటి వేలం నిర్వహిం చలేదని గ్రామస్తులు తెలిపారు.
రామేశ్వర్‌పల్లిలో
భిక్కనూరు : భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి ఎంపీటీసీ స్థానానికి సోమవారం వేలం పాడినట్టు తెలిసింది. ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వు కాగా ఆ సామాజిక వర్గానికి చెం దిన నలుగురు అభ్యర్థులు పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో గ్రామ బీసీ సం ఘం నేతలు సమావేశమై వే లం ఎంపీటీసీ స్థానానికి వేసినట్టు తెలిసింది. వేలంలో అత్యధికంగా రూ.3.09 లక్షలు చెల్లించడానికి ముం దుకు వచ్చిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. సదరు మహిళ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని కులపెద్ద లు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయమై గ్రామానికి చెందిన బీసీ సంఘం నేతలను సం ప్రదించగా అలాంటిదేమీ లేదని పేర్కొన్నా రు.
అధికారులు అడ్డుకున్నారు
ధర్పల్లి : ధర్పల్లి మండలం మైలారం గ్రామం లో సోమవారం ఎంపీటీసీ పదవికి వేలం పాటను అధికారులు అడ్డుకున్నారు. మైలా రం, కేశా రం గ్రామాలకు కలిపి ఒకే ఎంపీటీసీ స్థానం ఉంది. మైలారంలో 1,233 మంది, కేశారంలో 532 మంది ఓటర్లు ఉన్నారు. అయితే మైలారం వాసులు తమ గ్రామానికి చెందిన వ్యక్తినే ఎంపీటీసీ సభ్యుడిగా గెలిపిం చుకోవాలని భావించారు. ఇందుకోసం గ్రామ సమీపంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకుని వేలం పాటలు నిర్వహించారని సమాచారం. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ నాయకులు కొం దరు పోటీ పడినట్లు తెలిసింది.
విషయం తెలిి సన వెంటనే ఎస్‌ఐ అంజయ్య, తహశీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ మదన్‌మోహన్ హుటాహుటిన అక్కడకు చేరుకుని వేలం జరుగకుండా నిలిపివేశారు. గ్రామపెద్దల నుంచి హా మీ పత్రాన్ని తీసుకున్నారు. వేలం పాటతో అ భ్యర్థిని బరిలోకి దింపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయితే, అప్పటికే ఎం పీటీసీ స్థానానికి ఓ అభ్యర్థి రూ. 4.50 లక్షలు వేలం పాడి ఖరారు చేసుకున్నట్లు సమా చారం.
తహశీల్దార్ రాకతో ఆగిన వేలం
కోటగిరి : కోటగిరి మండలంలోని రాయకూర్ గ్రామంలో ఓప్రధాన రాజకీయపార్టీకి చెందిన నాయకులు ఎంపీటీసీ స్థానానికి వేలం వేసేం దుకు యత్నించారు. సమా చారం తెలుసుకున్న తహశీల్దార్ వెంకటేశ్వర్‌రావ్ గ్రామానికి చేరుకునే లోగా అక్కడి నుంచి నాయకులు చిత్తగించారు. దీంతో తహశీల్దార్ గ్రామంలో వేసిన టెంటును సిబ్బందిచే తొలగించారు.
పాట పాడు.. పదవి కొట్టు
Published Tue, Mar 18 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
Advertisement
Advertisement