మహబూబ్నగర్: పసిబిడ్డలు దేవుడితో సమానమంటారు. మాకు అభుంశుభం తెలియదు, పాపం పుణ్యం అంతకంటే తెలియదు. ఆకలేసినా.. నోరుతెరిచి అడగలేని తమపై ఎందుకీ వివక్ష అంటూ ఆ పసిహృదయాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. ఈ పాడులోకంలో తాము బతకలేమని భోరున విలపిస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలోని కోస్గిమండల కేంద్రం చెక్పోస్ట్ వద్ద ఇద్దరు పసికందులు ముళ్లపొదల్లో కనిపించారు. వాళ్లను నవమోసాలు మోసిన తల్లులు తనకు బరువునుకున్నారో.. లేక పోషించే శక్తి లేక వదిలేశారో గానీ, చివరికి ఆ పసిపిందెలు వీధికుక్కలపాలయ్యే పరిస్థితి తెచ్చింది. కపటం తెలియని ఆ పసిమెగ్గలు అమ్మ ఒడికి దూరమై ఎంత తల్లడిల్లి పోయివుంటాయి. చివరికి ఆ పసికందులను గమనించి 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సమాచారం.
విజయవాడలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కపటం తెలియని ఓ చిన్నారిని కర్కశంగా శ్మశానంలో వదిలి వెళ్లారు. అక్కడి ముళ్లపొదల దగ్గర ఉన్న ఆ పసికందును ఎవరో గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లినా.. ప్రాణాలు కోల్పోయి చివరకు మల్లీ ఆ శ్మశానానికే చేరింది. అప్పుడే నూరేళ్లు నిండిపోయిన పండుటాకునా నేను..! కాదే.. అమ్మ ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన తనను కాటిపాలు చేస్తారా.. ఎందుకిలా అంటూ ఆ మూగమనస్సు ఎంతో ఆవేధనకు గురైందో ఆ భగంతుడికే తెలుసు.
ఛీ.. ఈ పాడులోకంలో మేం బతకలేం..!
Published Wed, Sep 24 2014 11:10 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement