చొప్పదండి :‘ఇంత పెద్ద ఆసుపత్రిలో నాలుగే డెలివరీలు చేశారా.. చెప్పుకోవడానికి సిగ్గు లేదా’ అని కలెక్టర్ నీతూ ప్రసాద్ చొప్పదండిలోని పీహెచ్‌సీ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని ప్రభు త్వ ఆసుపత్రిలో మంగళవారం గంగాధర, బోయిన్‌పల్లి మండలాలకు సదరెం క్యాంపు నిర్వహించగా.. కలెక్టర్ తనిఖీ చేశారు. శిబిరం నిర్వహణపై ఎంపీడీవోలను, ఐకేపీ కోఆర్డినేటర్‌ను ప్రశ్నించారు. అనంతరం పరీక్షలు నిర్వహించిన దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ అందులో దరఖాస్తుదారుల సంతకాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా పని చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. వైద్యుల పరీక్షలు పూర్తయ్యాక వెంటనే వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ ఏరియా కోఆర్డినేటర్ నర్సయ్యను ఆదేశించారు.
నిర్లక్ష్యం తగదు
సదరెం క్యాంపు తనిఖీ అనంతరం ఆసుపత్రి ఆవరణలో కలెక్టర్ స్థానిక వైద్యుల పని తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు శ్రీనివాస్, శ్రీకర్, సుగుణాకర్, చంద్రశేఖర్ కలెక్టర్‌కు పలు వివరాలు అం దించారు. ఆసుపత్రి తరుపున నాలుగు డెలి వరీలు పూర్తయ్యాయని వైద్యులు చెప్పగా.. కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 శాతం వరకు సాధారణ డెలివరీలు చేయాలని ఆదేశించినా అమలు కావడం లేదని, వైద్యుల నిర్లక్షంతో ప్రైవేటు ఆసుపత్రులకు ఎక్కువ మంది తరలివెళ్తున్నారని, ఇప్పటికైనా పని తీరుమార్చుకోవాలని సూచించారు. ఆమె వెంట తహశీల్దార్ బైరం పద్మయ్య, ఎంపీడీవోలు అన్వర్ హుస్సేన్, ఎస్.వినోద్, ఇందుమతి ఉన్నారు.
మండలంలో కలెక్టర్ తనిఖీ
గంగాధర: మండలంలోని వెంకటాయిపల్లి, నాగిరెడ్డిపూర్, గంగాధర ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ తనిఖీ చేశారు. వెంకటాయిపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సందర్శన, స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాన్ని, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందిం చారు.
నాగిరెడ్డిపూర్‌లో బీడీ కార్మికుల పింఛన్ కోసం లబ్ధిదారుల ఎంపికకు నిర్వహిస్తున్న సర్వేను కలెక్టర్ తనిఖీ చేశారు. సర్వే పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులను గుర్తించాలని సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెంచాలని ఆదేశించారు. ఎంపీడీవో వినోద్, తహశీల్దార్ రాజేశ్వరి, సర్పంచు నరుకుల్ల రాధ, ఎంపీటీసీ లచ్చగౌడ్, వైద్యులు శ్రావణ్‌కుమార్, ఏఈలు బాలకృష్ణారెడ్డి, నర్సయ్య, గణేష్, మేఘరాజు, దశరథం ఉన్నారు.
చెప్పడానికి సిగ్గులేదూ..!
Published Wed, Feb 25 2015 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement