Nithu prasad
-
‘ఆధునికత’పై అవగాహన
కరీంనగర్ : రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ నీతూప్రసాద్ చెప్పారు. అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ఆత్మ) పాలకమండలి సమావేశం గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆత్మ బడ్జెట్‌ను శిక్షణకే కాకుండా రైతుల ఆస్తుల కల్పనకు ఉపయోగించాలన్నారు. కూరగాయల సాగు, ఉద్యానవన సాగులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలతో, వ్యవసాయ నిపుణులతో శిక్షణ ఇప్పించాలని తెలిపారు. వ్యవసాయశాఖ పనులకు ఆత్మబడ్జెట్ను వృథా చేయొద్దన్నారు. డివిజన్స్థారుుల్లో పెద్ద ఎత్తున కిసాన్మేళాలతో అవగాహన కల్పించాలన్నారు. అన్ని శాఖలు, వ్యవసాయ యంత్రాలు ఉత్పత్తి చేసే కంపెనీలు ఈ మేళాలో పాల్గొనాలని అన్నారు. విత్తనోత్పత్తి పెంచేందుకు చర్యలు చేపట్టాలని, నూతన చైర్మన్లకు ఆత్మపై అవగాహనకు వర్క్‌షాప్ నిర్వహించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ నాగేంద్ర, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఛత్రునాయక్, పశుసంవర్ధకశాఖ జేడీ, ఆత్మ కమిటీ ప్రాంతీయ చైర్మన్లు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. ఇందిర జలప్రభ పనులు వేగవంతం చేయండి ఇందిర జలప్రభ పథకం పనులను వేగవంతం చేయూలని కలెక్టర్ నీతూప్రసాద్ డ్వామా ఏపీవోలను ఆదేశించారు. ఇందిర జలప్రభపై గురువారం సమీక్షించారు. జిల్లాకు 15,474 ఎకరాలను లక్ష్యంగా నిర్ధేశించినట్లు తెలిపారు. విద్యుత్‌శాఖ అధికారులు, ఏపీవోలు సమన్వయంతో పనిచేసి అన్ని బోరుబావులకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసి ఉపయోగంలోకి తేవాలన్నారు. ఈ పథకంపై డ్వామా పీడీ ప్రతీవారం సమీక్షించాలని సూచించారు. రైతులకు డిమాండ్ ప్రకారం బోరుబావులు కాని, ఓపెన్ వెల్స్ కాని మంజూరు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డ్వామా పీడీ గణేశ్, ఏపీవోలు పాల్గొన్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలు ప్రోత్సహించండి చేనేత వస్త్రాల విక్రయూలను ప్రోత్సహించాలని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ప్రజలను కోరారు. నగరంలోని శ్రీరాజరాజేశ్వర కల్యాణ మండపంలో చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను గురువారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. చేనేత వస్త్రాలు వేసవిలో ఆరోగ్యకరంగా ఉంటాయన్నారు. 26 వరకు వస్త్రప్రదర్శన కొనసాగుతుందన్నారు. కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్, పోచంపల్లి, గద్వాలతోపాటు 40 చేనేత సహకార సంఘాలు రూపొందించిన వస్త్రాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ వీవీ.రమణామూర్తి, చేనేత జౌళిశాఖ డెరైక్టర్ ప్రీతిమీనా, జిల్లా సహాయ సంచాలకులు ఎం.వెంకటేశం, రఘురాంభూపాల్, చేనేత జౌళిశాఖ, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
చెప్పడానికి సిగ్గులేదూ..!
చొప్పదండి :‘ఇంత పెద్ద ఆసుపత్రిలో నాలుగే డెలివరీలు చేశారా.. చెప్పుకోవడానికి సిగ్గు లేదా’ అని కలెక్టర్ నీతూ ప్రసాద్ చొప్పదండిలోని పీహెచ్సీ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని ప్రభు త్వ ఆసుపత్రిలో మంగళవారం గంగాధర, బోయిన్పల్లి మండలాలకు సదరెం క్యాంపు నిర్వహించగా.. కలెక్టర్ తనిఖీ చేశారు. శిబిరం నిర్వహణపై ఎంపీడీవోలను, ఐకేపీ కోఆర్డినేటర్‌ను ప్రశ్నించారు. అనంతరం పరీక్షలు నిర్వహించిన దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ అందులో దరఖాస్తుదారుల సంతకాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా పని చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. వైద్యుల పరీక్షలు పూర్తయ్యాక వెంటనే వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ ఏరియా కోఆర్డినేటర్ నర్సయ్యను ఆదేశించారు. నిర్లక్ష్యం తగదు సదరెం క్యాంపు తనిఖీ అనంతరం ఆసుపత్రి ఆవరణలో కలెక్టర్ స్థానిక వైద్యుల పని తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు శ్రీనివాస్, శ్రీకర్, సుగుణాకర్, చంద్రశేఖర్ కలెక్టర్‌కు పలు వివరాలు అం దించారు. ఆసుపత్రి తరుపున నాలుగు డెలి వరీలు పూర్తయ్యాయని వైద్యులు చెప్పగా.. కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 శాతం వరకు సాధారణ డెలివరీలు చేయాలని ఆదేశించినా అమలు కావడం లేదని, వైద్యుల నిర్లక్షంతో ప్రైవేటు ఆసుపత్రులకు ఎక్కువ మంది తరలివెళ్తున్నారని, ఇప్పటికైనా పని తీరుమార్చుకోవాలని సూచించారు. ఆమె వెంట తహశీల్దార్ బైరం పద్మయ్య, ఎంపీడీవోలు అన్వర్ హుస్సేన్, ఎస్.వినోద్, ఇందుమతి ఉన్నారు. మండలంలో కలెక్టర్ తనిఖీ గంగాధర: మండలంలోని వెంకటాయిపల్లి, నాగిరెడ్డిపూర్, గంగాధర ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ తనిఖీ చేశారు. వెంకటాయిపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సందర్శన, స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందిం చారు. నాగిరెడ్డిపూర్‌లో బీడీ కార్మికుల పింఛన్ కోసం లబ్ధిదారుల ఎంపికకు నిర్వహిస్తున్న సర్వేను కలెక్టర్ తనిఖీ చేశారు. సర్వే పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులను గుర్తించాలని సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెంచాలని ఆదేశించారు. ఎంపీడీవో వినోద్, తహశీల్దార్ రాజేశ్వరి, సర్పంచు నరుకుల్ల రాధ, ఎంపీటీసీ లచ్చగౌడ్, వైద్యులు శ్రావణ్‌కుమార్, ఏఈలు బాలకృష్ణారెడ్డి, నర్సయ్య, గణేష్, మేఘరాజు, దశరథం ఉన్నారు. -
అక్రమ రవాణా ఆగేదెలా?
‘ఇకపై ఇసుక అక్రమ రవాణా చేస్తే సంబంధిత వాహనాలను వేలం వేస్తాం. బాధ్యులపై చట్టప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తాం’ ఈనెల 12న జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ వైస్‌ఛైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ లోకేష్‌కుమార్ జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్‌తో కలిసి పాల్గొన్న ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలివి. ‘ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, లారీలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపకండి. ఎక్కువ మొత్తంలో జరిమానా విధిస్తే చాలు’ ఇసుకు నూతన పాలసీపై బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చెప్పిన మాటలవి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నూతన ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తరువాత జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడుతుందని అంతా భావించారు. ఇకపై ఇసుక అక్రమ రవాణా చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు వాహనాలను వేలం వేస్తామని ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయడంతో ఇసుకాసురుల అక్రమాలకు కళ్లెం పడినట్లేనని అనుకున్నారు. తాజాగా మంత్రి టి.హరీష్‌రావు చేసిన ప్రకటన ఇసుకాసురులకు ఊరట కలిగిస్తోంది. ఇసుక అక్రమ రవాణా చేసే వారిని జైలుకు పంపొద్దని, జరిమానాతో సరిపెట్టండంటూ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. మంత్రి తాజా వ్యాఖ్యలతో ఇసుకాసురుల్లో మళ్లీ నూతన ఉత్సాహం వచ్చింది. యథేచ్ఛగా ఇసుకను జిల్లా సరిహిద్దులు దాటించేందుకు సిద్ధమవుతున్నారు. అధికారుల అండదండలతో చెక్‌పోస్టులు దాటుతున్న వాహనాలు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లాలో ఎనిమిది చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే ఆయా చెక్‌పోస్టులు అక్రమ రవాణాకు నిలయాలుగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల డివిజన్లలో పలు ప్రాంతాల్లో ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. ఒక్క కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచే సగటున 200 లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. కరీంనగర్ సమీపంలోని అల్గునూరులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసినప్పటికీ, రాత్రిపూట ఇసుక రవాణాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ అధికారులు అండదండలు, కొందరు ప్రజాప్రతినిధుల సహకారంతో అర్ధరాత్రి వందల కొద్ది లారీలు చెక్‌పోస్టులు దాటుతున్నారుు. అల్గునూరుతోపాటు మిగిలిన చెక్‌పోస్టుల వద్ద సైతం దాదాపు ఇదే తంతు కొనసాగుతోంది. ఇసుక లారీల యజమానులు చెక్‌పోస్టుల వద్ద ఉండే పోలీసుల్లో కొందరిని మచ్చిక చేసుకుని తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. నకిలీ వే బిల్లులు సృష్టించడంతోపాటు అధికారులు జారీ చేసిన వే బిల్లుల్లో తేదీలను తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో వే బిల్లుల్లో అక్రమాలను పసిగట్టిన పోలీసులు అల్గునూరు చెక్‌పోస్టు వద్ద ఏడు లారీలను పట్టుకున్నప్పటికీ ఆ తరువాత ఏమైందో ఏమోగానీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే రైట్ చెప్పేశారు. ఇసుక లారీలను వదిలిపెట్టేందుకు లారీల యజమానులతో ముందుగానే అధికారులు ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఒక్కో లారీకి వెయ్యి నుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధికారుల సహకారంతో ఇసుకాసురులు కొత్త అవతారాలెత్తుతున్నారు. బొగ్గు లారీలకు అతికించే స్టిక్కర్లను డూప్లికేట్‌గా ముద్రించి ఇసుక లారీలకు అంటిస్తున్నారు. చెక్‌పోస్టు సిబ్బందితో ముందుగానే కుమ్మక్కు కావడంతో వారు సైతం చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పైనుంచి ఆదేశాలు వచ్చిన సమయంలో మాత్రం లారీలను పట్టుకుని జరిమానా విధిస్తున్నారు. జీవో5 కాగితాలకే పరిమితమా? ఇసుక మాఫీయాపై ఉక్కుపాదం మోపడానికి కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 5ను జారీ చేసింది. గతంలో ఇసుక అక్రమ రవాణ చేసే వాహనాలను పోలీసులు పట్టుకుని రెవెన్యూ విభాగానికి అప్పగించేవారు. అనంతరం జరిమానాతో సరిపెట్టేవారు. ఒకవేళ రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేస్తే ఇసుక చోరీ కేసులు నమోదు చేసేవారు. అయితే ఇవి చాలా తక్కువ సందర్బాల్లో నమోదు అయ్యేవి. వీటిలో ఎక్కువభాగం నేతల అనుచరులకు చెందినవి కావడంతో తూతూమంత్రంగా జరిమానా వేసి వదిలివేసేవారు. వీటికి జీవో నంబర్ 5 ముక్కుతాడు వేసినట్లయింది. ఈ జీవో ప్రకారం ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన ట్రాక్టర్, లారీలను ఏకంగా వేలం వేస్తారు. అట్లాగే అక్రమ రవాణా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. అయినా వారిలో మార్పు రానిపక్షంలో అవసరమైతే వారిపై రౌడీషీట్ కూడా తెరవొచ్చని జీవోలో పేర్కొన్నారు. అయితే తాజాగా సంబంధిత శాఖ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు సదరు జీవోను నీరుకార్చేలా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు వద్దని కేవలం జరిమానాతో వదిలివేయాలని సూచించడంతో పరోక్షంగా ఇసుక అక్రమ రవాణాకు ఊతం ఇచ్చినట్లయిందని అధికారులే అభిప్రాయపడుతున్నారు. మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించడంతో అధికారుల జీవోను తు.చ. తప్పకుండా అమలు చేసే అవకాశాలే లేవని చెబుతున్నారు.