వరంగల్ డివిజన్‌లోని గ్రామీ ణ తపాల శాఖలో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్లు...
మహబూబాబాద్/హన్మకొండ : వరంగల్ డివిజన్‌లోని గ్రామీణ తపాల శాఖలో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్లు వరంగల్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎ.శ్రీనివాసరావు తెలి పారు.
మహబూబాబాద్‌లోని ప్రధాన తపాల శాఖ కార్యాల యంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డాక్ గ్రామీణ సేవకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వరంగల్ డివి జన్‌లో ప్రధాన పోస్టులు 18 ఖాళీగా ఉన్నాయని, మీ సేవ కేం ద్రాల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. హెడ్ పోస్టుమాస్టర్ కోట సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
అదేవిధంగా తపాల శాఖలో హన్మకొండ డివిజన్‌లో ఖాళీగా ఉన్న 9 జీడీఎస్, 15 జీడీఎస్ మెయిల్ కారియర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు డివిజనల్ ఆఫీసర్ సత్యనారాయణ ఓ ప్రకట నలో తెలిపారు. వివరాలకు 9490164877, 9490164813 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.