
హోలీరే హోలీ
నగరంలోని పలు కాలనీల్లో శనివారం రాత్రి కామదహన కార్యక్రమం నిర్వహించారు. దీంతో నేడు హోలీ ఆడేందుకు యువతీయువకులు, చిన్నా..పెద్దా సిద్ధమయ్యారు.
వివిధ పాఠశాలల్లో చిన్నారులు శనివారమే హోలీ సంబరాల్లో మునిగితేలారు. ఎన్‌జీఎస్, బచ్‌పన్, మరికొన్ని పాఠశాలల్లో సందడి నెలకొంది. నగరం నేడు రంగుల్లో మునిగిపోనుంది. రంగుల ప్రపంచం ఆవిష్కృతం కానుంది.