శరీరంలోకి దిగిన ఇనుప చువ్వ | iron rod Encamped Over the body | Sakshi

శరీరంలోకి దిగిన ఇనుప చువ్వ

Mar 26 2014 4:49 AM | Updated on Sep 2 2018 4:23 PM

ప్రమాదవశాత్తు ఇనుప చువ్వ శరీరంలోకి దిగడంతో గంటపాటు ఓ వ్యక్తి నరకయాతన అనుభవించాడు. వరంగల్ జిల్లా భూపాలపల్లి పట్టణంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది.

తల్లడిల్లిన బాధితుడు
 భూపాలపల్లి, న్యూస్‌లైన్: ప్రమాదవశాత్తు ఇనుప చువ్వ శరీరంలోకి దిగడంతో గంటపాటు ఓ వ్యక్తి నరకయాతన అనుభవించాడు. వరంగల్ జిల్లా భూపాలపల్లి పట్టణంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. స్థానిక కారల్‌మార్క్స్ కాలనీకి చెందిన అలుగుల ప్రభాకర్ సింగరేణి ఏరియాలోని 6వ ఇంక్లైన్‌లో హాలర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటి ఎదుట సిమెంటు రేకులపై చెత్త పేరుకుపోవడంతో తొలగించేందుకు మంగళవారం ఉదయం సిమెంటు రేకుల పైకి ఎక్కేందుకు యత్నించాడు.
 
 ఈ క్రమంలో రేకు పగిలిపోవడంతో అతడు ఇంటి ప్రహరీపై పడిపోయాడు. దీంతో ప్రహరీ పిల్లర్‌పై నిటారుగా ఉన్న ఇనుపచువ్వ అతడి శరీరంలోకి దిగబడింది. మర్మాంగం కింది నుంచి చొచ్చుకొని పైకి వచ్చింది. దీంతో ప్రభాకర్ చువ్వను వదిలించుకుని రాలేకపోయాడు. సుమారు గంటపాటు నరకయాతన అనుభవించాడు. స్థానికులు సమాచారం అందించగా సింగరేణి రెస్క్యూటీం రంగంలోకి దిగి ఇనుప చువ్వను జాగ్రత్తగా కత్తిరించింది. అయితే, శరీరం లోపల చువ్వను తీయటం వీలుకాకపోవటంతో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే బాధితుడు నొప్పి భరించలేక ఒక్కసారిగా చువ్వను బయటకు లాగాడు. అనంతరం అతడిని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement